Wednesday, May 6, 2026 09:03 PM
Wednesday, May 6, 2026 09:03 PM

నిజంగానే ఓటీటీలు అంత రేటు పెడుతున్నాయా..?

2025 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా దాదాపు 8 సంవత్సరాలుగా థియేటర్ల విస్తరణ, నాన్-థియేట్రికల్ మార్కెట్ నుండి రికార్డు స్థాయిలో ఆదాయాలు సాధించింది. కోవిడ్ అనంతర కాలంలో, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు స్ట్రీమింగ్ హక్కులను దూకుడుగా కొనుగోలు చేయడంతో తెలుగు సినిమా అధిక ధరలతో అపారమైన లాభాన్ని పొందింది. అయితే.. ఓటీటీ పరిధి గణనీయంగా మారిపోయింది. ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఖర్చులను తీవ్రంగా తగ్గించుకున్నాయి.

Also Read : విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి ఎప్పుడంటే..!

ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా తమ చిత్రాలకు కోట్ చేయబడిన తక్కువ ధరలతో ఆశ్చర్యపోయాయి. అటువంటి సందర్భంలో, కొన్ని సినిమాలు “రికార్డ్-బ్రేకింగ్” ఓటీటీ ఒప్పందాలను పొందాయనే ప్రచారం చేయడం ఇప్పుడు సినీ పరిశ్రమలో దుమారం రేపుతోంది. అయితే ఇవి మార్కెట్ వర్గాలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి సినిమాకు సంబంధించిన ఓ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. రాజమౌళి రూ.800 కోట్ల ఓటీటీ ఆఫర్‌ను తిరస్కరించారని, ఇంకా పెద్ద డీల్ కోసం వేచి ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. అది పూర్తిగా తప్పుడు కథనం అని అటు వ్యాపార వర్గాలు, ఇటు సినీ ప్రముఖులు కొట్టిపారేశారు. ఇది కేవలం ప్రచార గిమ్మిక్ తప్ప మరేమీ కాదంటున్నారు.

నిజానికి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించదు. ముఖ్యంగా సినిమా నిర్మాణ బడ్జెట్ దానికి సమర్థనీయం కానప్పుడు. అలాంటి ఆఫర్ నిజంగా టేబుల్‌పై ఉంటే, రాజమౌళితో సహా ఏ చిత్ర నిర్మాత కూడా దానిని తిరస్కరించే అవకాశం లేదు. ఇప్పుడు, అల్లు అర్జున్ – అట్లీ చిత్రం చుట్టూ ఇలాంటి ప్రచారమే జరుగుతోంది, నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.600 కోట్ల విలువైన ఓటీటీ ఒప్పందాన్ని ముగించిందనే మాట బాగా వినిపిస్తోంది. నిజానికి ఇది కూడా అతిశయోక్తి. ఈ స్థాయిలో డీల్ జరిగితే.. ఈ పాటికే మార్కెట్‌ వర్గాల్లో బయట పడుతుంది కూడా.

Also Read : మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ఒంటరి అయ్యారా..?

నిజానికి ఇప్పటి వరకు ఒక తెలుగు చిత్రానికి జరిగిన అతిపెద్ద ఓటీటీ డీల్ రూ.270 కోట్లు. అది పుష్ప 2 సినిమా కోసం ఆ స్థాయిలో వెచ్చించారు. ఇందుకు ప్రధాన కారణం.. పుష్ప సూపర్ హిట్‌తో పాటు.. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు రావటమే. ఇక సూపర్ హిట్ సినిమా, రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న దురంధర్‌ సినిమా కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.285 కోట్లు చెల్లించింది. అది కూడా ఆ చిత్రం మెగా బ్లాక్‌బస్టర్‌ అయిన తర్వాత. ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ వస్తున్న సినిమాలకు ఓటీటీ సంస్థలు రూ.300 నుంచి 350 కోట్ల పరిధి దాటే అవకాశం లేదంటున్నారు. ఇది కూడా వారి సినిమాలకు వచ్చిన కలెక్షన్ల ఆధారంగా మాత్రమే. కానీ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేందుకు 600 కోట్లు అని ఒకరంటే.. కాదు 800 కోట్లు అని తప్పుడు లెక్కలతో సినిమాలపై భారీ అంచనాలను సృష్టిస్తున్నారు. ఇది కొన్ని సార్లు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదమంటున్నారు సినీ విశ్లేషకులు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్