Wednesday, August 5, 2026 11:14 AM
Wednesday, August 5, 2026 11:14 AM

నాపై కుట్ర జరుగుతోంది.. బాంబు పేల్చిన శివాజీ

దాదాపు 4, 5 రోజుల నుంచి సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ విషయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన సామాన్ల వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలోని కొందరు, అలాగే బయట మహిళా సంఘాలు కూడా తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తున్నాయి. మహిళలకు స్వేచ్ఛ లేదని కొందరు మాట్లాడుతుంటే శివాజీ మాట్లాడింది కరెక్టేనని మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ నేపద్యంలో మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం, శివాజీ క్షమాపణ చెప్పటం కూడా జరిగిపోయాయి. అయినప్పటికీ వివాదం మాత్రం ఇంకా చల్లారడం లేదు.

Also Read : దమ్ముంటే మోడీని, అమిత్ షా ని అరెస్ట్ చేస్తానని ప్రకటించగలవా?

నేడు శివాజీ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు శివాజీ. తనతో కెరీర్ మొదలు పెట్టిన వారికి తనపై కోపం ఉందని.. త్వరలో ఇబ్బంది పెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారని సంచలన కామెంట్ చేశారు శివాజీ. తనకు బాగా కావాల్సిన వారు ఇంత కుట్ర చేస్తారు అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనవసరంగా సలహాలు ఇచ్చానని సలహాలు ఇవ్వడం మానుకోవాలి అనే విషయం తనకు అర్థమైందంటూ శివాజీ పేర్కొన్నారు.

Also Read : అజారుద్దీన్ కు పదవీ గండం..? గవర్నర్ షాక్ ఇస్తారా..?

చీర కట్టుకున్న వాళ్లను చూసి మీది భారత్ అని గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను తప్పు చేశాను అనిపిస్తే రండి మాట్లాడుకుందాం అంటూ ఆహ్వానించారు. మహిళా కమిషన్ అడిగిన వాటికి సమాధానం చెప్పానని చెప్పుకొచ్చారు. విచారణ కోసం మహిళా కమిషన్ మళ్ళీ పిలిచిన తాను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక శివాజీ వ్యాఖ్యలపై అటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఫైర్ అయ్యారు. మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉండగా శివాజీపై కంప్లైంట్ చేసేందుకు కొందరు మహిళల నటులు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్