అనుకున్నంత అయ్యింది. పారిశ్రామిక వేత్తల్లో ఉన్న భయం అలాగే ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా కూడా.. ఇప్పటికే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనే కొనసాగుతుందా.. అంటే.. అవుననే మాటే వినిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణలు వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల నిర్వహణ ఒకటి అయితే.. మరొకటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కేటాయించేందుకు ఆహ్వానించిన టెండర్ల ప్రక్రియ. వైద్య విద్య అంటే అత్యంత ఖరీదైనదిగా అంతా భావిస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలు చాలా చోట్ల ఉన్నప్పటికీ.. మెడికల్ కాలేజీలు మాత్రం చాలా తక్కువ. దీని వల్ల ఆదాయం ఎక్కువ వస్తున్నప్పటికీ నిర్వహణకు సరైన అనుభవం ఉండాలి.
Also Read : శివాజీ సామాన్ల కామెంట్స్ పై.. మిశ్రమ స్పందన..!
అందుకే మెడికల్ కాలేజీలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. మెడికల్ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, సామాన్యులకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు పీపీపీ విధానంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో చంద్రబాబు సారధ్యంలోని కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యం నడుస్తోందనే మాట బాగా వినిపిస్తోంది. ఏపీ సచివాలయంలో ఇప్పటికీ వైసీపీ అభిమాన ఐఏఎస్‌లు కీలక స్థానాల్లో ఉన్నారు. అలాగే జగన్ ఏదైనా ఒక మాట చెబితే చాలు.. అది అటు ప్రభుత్వంలో, ఇటు ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వైసీపీ ఓడినప్పటికీ.. వైఎస్ జగన్ మాత్రం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులను, పోలీసులను, ఉన్నతాధికారులను, పారిశ్రామిక వేత్తలను పదే పదే బెదిరిస్తూనే ఉన్నారు.
Also Read : తమ సత్తా ఏంటో చూపించిన రోకో..!
తెనాలిలో గంజాయి బ్యాచ్‌కు పోలీసులు బహిరంగ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. దీని ప్రభావం చాలా మందిపై స్పష్టంగానే కనిపించింది. నేరం చేయాలంటే భయపడే స్థాయికి చేరుకున్న దశలో రంగంలోకి దిగిన జగన్.. తాడేపల్లి నుంచి తెనాలి వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. గంజాయి బ్యాచ్ కుటుంబాన్ని పరామర్శించారు. మీపైన చర్యలు తీసుకున్న వారిని.. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ గంజాయ్ బ్యాచ్‌కు అనుకూలంగా మాట్లాడారు. ఈ ప్రకటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. నాటి నుంచి పోలీసులు నేరస్తులకు బహిరంగ ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక పీపీపీ విధానంపై హంగామా చేసిన వైసీపీ అధినేత.. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాలేజీలు తీసుకున్న వారిని అరెస్టు చేస్తామని బెదిరించారు. నిజానికి రాజకీయాల్లో ఉన్న నేతలు బెదిరింపు వ్యాఖ్యలు చేయడం సర్వ సాధారణం.
Also Read : చంద్రబాబు విజన్‌కు గ్లోబల్ గుర్తింపు.. విశాఖకు అమెజాన్ ఐటీ సెంటర్
తాట తీస్తాం, సంగతి చూస్తాం అంటూ పదే పదే చెబుతూనే ఉంటారు. కాబట్టి.. ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కానీ అవి కేవలం మాటల వరకే పరిమితం. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తల్లో ఊపు తీసుకువచ్చేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి ఇదే వ్యాఖ్యలు జగన్ చేస్తే.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర ప్రభావం చూపించాయి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు పిలిచిన టెండర్లలో ఒకే ఒక సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి మాత్రమే బిడ్ దాఖలైంది. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలకు ఒక్కరూ కూడా ముందుకు రాలేదు. ఇందుకు ప్రధానంగా జగన్ బెదిరింపులే కారణమనే మాట ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్‌లో ప్రభుత్వంలో కూడా బాగా వినిపిస్తోంది.
Also Read : కొంప ముంచుతున్న టీడీపీ పిఏలు..?
మరోవైపు జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు చేసిన రచ్చ మామూలుగా లేదు. దాదాపు రాష్ట్రమంతా జగన్ అభిమానులు రెచ్చిపోయారు. రాయలసీమ ప్రాంతంలో అయితే బహిరంగంగా జంతు బలులు చేసి.. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు. ఇక పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి రోజా చేసిన రప్పా రప్పా సంజ్ఞలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. వైసీపీకి ఎవరైనా ఎదురు వస్తే.. ఇక రప్పా రప్పా అంటూ బెదిరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అటు జగన్ పుట్టిన రోజు వేడుకల్లో దాడులకు కూడా తెగబడ్డారు. ఈ విషయంపై మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత ఒకటి రెండు చోట్ల మాత్రం పోలీసులు అరెస్టులు చేశారు. కానీ.. ప్రజల్లో ఉన్న భయం మాత్రం అలాగే ఉంది. అంటే.. ఏపీలో జగన్ పార్టీ ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

