Saturday, September 19, 2026 11:18 PM
Saturday, September 19, 2026 11:18 PM

రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కు మైండ్ బ్లాక్

సాధారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల దాడి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నాయకులను విమర్శించే విషయంలో రేవంత్ రెడ్డి స్పీడు ఏ రేంజ్ లో ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి నాయకులు ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి.. రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శల దాడి పెంచారు. వీటిపై తాజాగా రేవంత్ రెడ్డి కొడంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : టీడీపీ మంత్రుల్లో లోకల్ లీడర్ల టెన్షన్..?

కేటీఆర్ లక్ష్యంగా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నవ్వులు పూయించగా.. కెసిఆర్ ను టార్గెట్ చేసిన విధానం ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ పై పెద్ద చర్చ జరుగుతోంది. 2028 లేదా 29 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీని అసలు అధికారంలోకి రానీయనని.. తాను రాజకీయం చేసినన్ని రోజులు కూడా గులాబీ పార్టీ అధికారంలోకి రాదని ధీమాగా శపథం చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పటికంటే 2028లో జరిగే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. 80 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : తమ సత్తా ఏంటో చూపించిన రోకో..!

ఒకవేళ సీట్లు గనుక 153కు పెరిగితే మాత్రం.. వందకు పైగా స్థానంలో తమ పార్టీ గెలుస్తుందన్నారు రేవంత్ రెడ్డి. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి సీట్ల లెక్కతో సహా చెప్పడంతో.. పెద్ద చర్చే మొదలైంది. తనను తక్కువ అంచనా వేసే వాళ్లకు కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఇక దీనిపై గులాబీ పార్టీ నాయకులు స్పందిస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాను సైతం ఊపేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లే విధంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న రేవంత్ రెడ్డి.. తాజా వ్యాఖ్యలతో ఒక స్థాయిలో సంచలనం సృష్టించారనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్