Saturday, September 19, 2026 11:21 PM
Saturday, September 19, 2026 11:21 PM

టీడీపీ మంత్రుల్లో లోకల్ లీడర్ల టెన్షన్..?

రాజకీయాల్లో స్థానిక నాయకత్వం పాత్ర అనేది కీలకంగా ఉంటుంది. ఎంత బలమైన నాయకుడైనా సరే నియోజకవర్గంలో ఉన్న స్థానిక నాయకత్వం సహకరించకపోతే ఇబ్బందులు పడటం ఖాయం. ఇప్పుడు ఏపీలో కొందరు మంత్రులకు స్థానిక నాయకత్వంలో నెలకొన్న విభేదాలు పెద్ద సమస్యగా మారాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రికి స్థానిక నాయకత్వ సమస్య ఎక్కువగా ఉంది. కీలక పదవిలో ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం నుంచి సహకారం లేదు. మంత్రి పని చేస్తున్న సరే స్థానిక నాయకత్వం మాత్రం.. ప్రజలకు దూరంగా ఉంటుంది. పదవులు తీసుకున్న వారు కూడా మంత్రిని పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. మంత్రిపై విమర్శలు చేసినప్పుడు కూడా పెద్దగా స్పందించడం లేదు.

Also Read : శివాజీ సామాన్ల కామెంట్స్ పై.. మిశ్రమ స్పందన..!

కోస్తా జిల్లాలో ఒక కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సదరు మంత్రిగారు.. ఇప్పుడు కీలక శాఖ నిర్వహిస్తున్నారు. మంత్రిగారికి అధిష్టానం వద్ద మంచి మార్కులు ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలో స్థానిక నాయకత్వ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. తాను కష్టపడుతున్నప్పటికీ నియోజకవర్గంలో నాయకత్వం సహకరించకపోవడంతో మంత్రికి ఆందోళన మొదలైంది. దీనిపై పార్టీ అధిష్టానం కూడా మంత్రికి పలు సూచనలు చేసింది. ఇక రాయలసీమకు చెందిన ఒక కొత్త మంత్రి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎవరిని నమ్మాలో అర్థం కాక ఆ నాయకుడు కంగారు పడిపోతున్నారు.

Also Read : అమరావతికే కుచ్చు టోపీ పెడుతున్న బినామీ ఏజెన్సీలు..!

పేరుకు పెద్ద శాఖ కాకపోయినా.. నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో శాఖపై దృష్టి పెట్టలేకపోతున్నారు మంత్రిగారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం పలు సూచనలు చేసి ఓ సీనియర్ నాయకుడు సలహాలు తీసుకోవాలని కూడా సూచించింది. అయినప్పటికీ మంత్రిగారికి నియోజకవర్గంలో సెగ మాత్రం తగ్గటం లేదు. అటు కుటుంబం నుంచి కూడా సహకారం లేదు అనే మాట వినపడుతోంది. వైసీపీ బలంగా ఉండే ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈ మంత్రి గారికి.. జిల్లా నేతల నుంచి కూడా సహకారం కరువైంది అనే మాట సైతం వినపడుతోంది. ఇది మారకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గట్టి దెబ్బ తినే అవకాశాలు సైతం ఉన్నాయి. ప్రభుత్వంపై సానుకూలతో ఉన్నప్పటికీ మంత్రులకు స్థానిక నాయకత్వం నుంచి సహకారం లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్