Sunday, March 22, 2026 01:39 PM
Sunday, March 22, 2026 01:39 PM

శివాజీ సామాన్ల కామెంట్స్ పై.. మిశ్రమ స్పందన..!

సినీ పరిశ్రమలో ఉన్న వాళ్లు ఏ మాట మాట్లాడినా సరే.. అది పెద్ద దుమారం అవుతుంది. ముఖ్యంగా మహిళల గురించి అయితే.. ముందు వివాదం అవుతుంది.. ఆ తర్వాత తీవ్ర పరిణామాలకు కూడా దారి తీస్తుంది. చేసిన వ్యాఖ్యల్లో నిజమా.. అబద్ధమా అనే విషయాన్ని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా గట్టిగా ఎదురు దాడి చేయడమే. దీని వల్ల పబ్లిసిటీతో పాటు కావాల్సినంత పేరు కూడా వస్తుంది. తాజాగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఈ కోవకే చెందుతున్నాయి.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్‌లు వేసుకునే బట్టలపై శివాజీ వ్యాఖ్యానించారు. చక్కగా చీర కట్టుకుంటే లక్షణంగా ఉంటుందన్నారు. ఇలా చెబుతున్నందుకు ఏమనుకోవద్దు అంటూ మొదలుపెట్టిన శివాజీ.. మీ అందం మొత్తం నిండుగా వేసుకొనే దుస్తుల్లోనే ఉంటుంది. ఫ్యాషన్‌ దుస్తులు వేసుకున్నప్పుడు అందరూ బాగున్నాయనే అంటారు. కానీ, లోపల తిట్టుకుంటారు. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది.. సావిత్రి, సౌందర్యలను ఇందుకు ఉదాహరణగా వ్యాఖ్యానించారు శివాజీ. గ్లామర్‌ ఉండాలి.. కానీ దానికి ఒక హద్దు ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు.. అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో సమయంలో నోరు జారారు.

Also Read : మాజీ మావోయిస్టుల సంచలన నిర్ణయం..?

శివాజీ వ్యాఖ్యలపై పరిశ్రమలోనే పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. శివాజీ పేరు ప్రస్తావించకుండానే హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మనోజ్ స్పష్టం చేశారు. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి చర్చించలేని అంశాలని మహిళల బట్టలపై తీర్పు ఇచ్చే అధికారం ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇదే విషయంపై యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయ్ కూడా ఘాటుగా స్పందించారు. తిండి, బట్ట అనేది పూర్తిగా వ్యక్తిగత విషయాలని.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండే స్వేచ్ఛ ఉంటుందని.. బిర్యానీ కావాలనుకునే వారికి పప్పన్నం పెడితే నచ్చని భోజనం ఎలా తినలేమో.. నచ్చని బట్టలు కూడా వేసుకోలేమన్నారు.

తన వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే మన్నించాలన్నారు శివాజీ. అవి అందరినీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని.. అయినా కూడా తాను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయిందన్నారు. అయితే శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్ శివాజీకి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

Also Read : వృద్ధురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

ఈ విషయంపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శివాజీ పై విమర్శలు చేసిన అనసూయ వ్యాఖ్యలను కరాటే కల్యాణి తీవ్రంగా తప్పుబట్టారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా కనిపించే దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారని కల్యాణి నిలదీశారు. శివాజీ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. ఒక అన్నగా, తండ్రిగా ఆలోచించి శివాజీ వ్యాఖ్యలు చేశారన్నారు. కేవలం పాపులారిటీ కోసం కొందరు వ్యాఖ్యలు చేస్తుంటారని.. అలాంటి వారు పిల్లలపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఎమన్నా చూపించేది ఉంటే మీ ఆయనకు చూపించుకోండి, పబ్లిక్‌కి కాదు.. అంటూ కల్యాణి ఘాటుగా బదులిచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్