Sunday, September 20, 2026 12:27 AM
Sunday, September 20, 2026 12:27 AM

వృద్ధురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

గత కొన్నాళ్లుగా ప్రజల్లోకి వెళుతున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరస పర్యటనలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని, పరిష్కరించేందుకు అడుగులు వేస్తున్నారు పవన్. తాజాగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం.. ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్ళు, ప్రహరీ గోడలను తొలగించింది అప్పుడు ప్రభుత్వం. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read : నోరు జారితే వీసా పోయినట్టే.. సోషల్ మీడియాపై గురి..!

జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇళ్లను కూల్చివేశారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ రావాలని పవన్ కళ్యాణ్ ను అప్పట్లో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరారు. దీనితో ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ తన ఇంటికి రావడంతో ఆప్యాయంగా వృద్ధురాలు నాగేశ్వరమ్మ.. పవన్ ను హత్తుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది. నాగేశ్వరమ్మ కష్టాలను పవన్ కళ్యాణ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తన కుటుంబ సభ్యులను కూడా నాగేశ్వరమ్మ పరిచయం చేశారు.

Also Read : బీఆర్ఎస్ బాడీ లాంగ్వేజ్ మారిందా..?

ఈ సందర్భంగా కుటుంబానికి తాను అండగా ఉంటానని ప్రకటించారు. నాగేశ్వరావు ఆర్థిక పరిస్థితి తెలుసుకునే ఆమెకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఉప ముఖ్యమంత్రి. ఆమె మనవడికి లక్ష రూపాయల సహాయం అందించారు. నాగేశ్వరరావు మనవడి చదువుకు నెలకు 5000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడైనా కష్టం ఉంటే తన దగ్గరకు రావచ్చని ప్రభుత్వ అధికారులు మీకు అండగా ఉంటారని, వ్యక్తిగతంగా కూడా తాను అండగా నిలుస్తారు అంటూ పవన్ హామీ ఇచ్చారు. ఇక పవన్ రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్