Sunday, September 20, 2026 12:59 AM
Sunday, September 20, 2026 12:59 AM

సోషల్ మీడియాపై ఇన్కం టాక్స్ గురి..? నిజమెంత..?

ఈ రోజుల్లో సోషల్ మీడియా అన్నింటిలో భాగంగా మారిపోయింది. ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలకు సోషల్ మీడియా ఉపయోగపడుతోంటే.. పదే పదే సోషల్ మీడియా విషయంలో విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ప్రభుత్వాలు ఈ సామాజిక మాధ్యమాల విషయంలో యాక్టివ్ గా ఉంటూ ఓ కన్నేసి ఉంచుతున్నాయి. దేశ భద్రతకు సైతం కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతోన్న సోషల్ మీడియా విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు ప్రపంచ దేశాలు కూడా సిద్దమయ్యాయి.

Also Read : ఆయనను ఒంటరిని చేసిన కమలనాథులు..!

ఇదిలా ఉంచితే.. ఇప్పుడు భారత్ లో ఓ వార్త సంచలనంగా మారింది. సోషల్ మీడియాపై భారత ఆదాయపు పన్ను శాఖ ఓ కన్నేసి ఉంచిందని వార్తలు ఆందోళన కలిగించాయి. ఏప్రిల్ 1, 2026 నుండి ఆదాయపు పన్ను శాఖ ఈమెయిల్‌ లు, సోషల్ మీడియా ఖాతాలతో సహా ప్రైవేట్ డిజిటల్ డేటాను విస్తృతంగా యాక్సెస్ చేస్తుందని వార్తలు వచ్చాయి. పన్ను ఎగ్గొట్టే వారి సోషల్ మీడియా ఖాతాలను యాక్సెస్ చేసే అధికారం ఆదాయపు పన్ను శాఖ కు ఉందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో దీనిపై జాతీయ మీడియా పూర్తి క్లారిటీ ఇచ్చింది.

Also Read : గంభీర్ కు బ్రేకులు.. సెలెక్షన్ కమిటీలో ఆ ఇద్దరే..?

ఇది అవాస్తవం అంటూ కొట్టిపారేసింది. ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 247 కింద సంబంధిత నిబంధనలను ప్రస్తావిస్తూ.. కొన్ని పరిస్థితులలో మాత్రమే సోషల్ మీడియా ను ఆదాయపు పన్ను శాఖ వాడుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. స్పష్టమైన సమాచారం, సర్వే వంటి కార్యక్రమాలకు మాత్రమే సోషల్ మీడియాను వినియోగించే అవకాశం ఉందని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టం, 2025 అమలులోకి వచ్చిన తర్వాత దీనిపై చర్చ మొదలైంది. ప్రైవేట్ డేటాకు భద్రతకు సంబంధించి ఆందోళన మొదలైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్