Sunday, September 20, 2026 01:07 AM
Sunday, September 20, 2026 01:07 AM

గంభీర్ కు బ్రేకులు.. సెలెక్షన్ కమిటీలో ఆ ఇద్దరే..?

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరున్న భారత క్రికెట్ లో ఇప్పుడు పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాలు జరుగుతున్నాయనే విమర్శలు, కొందరు ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు పదే పదే రావడం వంటివి జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా సీనియర్ ఆటగాళ్ళ విషయంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ అనుసరిస్తోన్న వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. శుభమన్ గిల్ కు అనుకూలంగా అతను వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

Also Read : తిరుమలలో మరో భారీ స్కామ్.. 50 కిలోల బంగారం మాయం!

ఈ నేపధ్యంలో తాజాగా టి20 వరల్డ్ కప్ కు, న్యూజిలాండ్ తో టి20 సీరీస్ కు ఎంపిక చేసిన జట్టులో నుంచి శుభమన్ గిల్ ను తప్పించడం సంచలనం అయింది. గిల్ ఫెయిల్ అవుతున్నా పదే పదే అవకాశాలు ఇవ్వడాన్ని బోర్డు కూడా సీరియస్ గా తీసుకుంది అనే కామెంట్స్ వచ్చాయి. ప్రతిభ ఉన్న సంజూ సామ్సన్ ను కావాలనే పక్కన పెడుతున్నారనే విమర్శలు సైతం వచ్చాయి. ఇలాంటి టైం లో గిల్ కు షాక్ ఇవ్వడం, ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకు రావడం ఆశ్చర్యం కలిగించాయి.

Also Read : ఆ ఐఏఎస్ అధికారులంటే ఎందుకంత ప్రేమ..?

అయితే దీని వెనుక ఇద్దరు సెలెక్టర్ లు కీలకంగా వ్యవహరించారని వార్తలు వస్తున్నాయి. ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాలు.. గంభీర్ కు అడ్డుకట్ట వేస్తున్నారని సమాచారం. న్యూజిలాండ్ తో జరిగే వన్డే సీరీస్ లో కూడా గిల్ ను గాయం కారణంగా పక్కన పెట్టేందుకు సెలెక్టర్ లు రెడీ అయ్యారట. సంజు సామ్సన్ కు ప్రత్యామ్నాయంగా మరో ఓపెనర్ ను కావాలనే సెలెక్ట్ చేయలేదనే కామెంట్ కూడా వినపడుతోంది. వన్డే సీరీస్ లో శ్రేయాస్ అయ్యర్ ను పక్కన పెట్టాలనే ఒత్తిడి వచ్చినప్పటికీ.. అతనిని తీసుకునేందుకు సిద్దమైనట్లు కూడా క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వన్డే సీరీస్ కు కెప్టెన్ గా కెఎల్ రాహుల్ వైపే ఈ ఇద్దరూ మొగ్గు చూపుతున్నారని, సెలెక్షన్ కమిటీలో జరిగే పరిణామాలను బోర్డు పెద్దలకు ఈ ఇద్దరూ ఇప్పటికే సమాచారం ఇచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్