2014లో తొలిసారి దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి పుష్కర కాలంగా ఆయనే ప్రధాని కుర్చీలో ఉన్నారు. ప్రధాని మోదీకి 75 ఏళ్ల వయస్సు దాటింది. నిజానికి బీజేపీలో ఏ నాయకుడైనా సరే 75 ఏళ్ల వయస్సు లేదా వరుసగా మూడో సారి పదవి అవకాశం లేదు. అయినా సరే.. మోదీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు. అయితే 75 ఏళ్ల వయసు తర్వాత మోదీ తన పదవి నుంచి రిటైర్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం 2024-29 పూర్తి పదవీ కాలం మోదీ మాత్రమే ప్రధాని కుర్చీలో కూర్చుంటారని ఇప్పటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు పరోక్షంగా స్పష్టం చేశారు కూడా. అయితే 2029లో ఎన్నికల సమయంలో బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరూ అనే చర్చ ఇప్పటికే మొదలైంది.
Also Read : 25 ఎకరాల భూమి కోసం అసోం సీఎంకు చంద్రబాబు లేఖ.. ఏంటీ స్టోరీ..?
2001 అక్టోబరులో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ తొలిసారి అధిరోహించారు. నాటి నుంచి 2014 మే 21 వరకు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి గెలుపు తర్వాత తొలిసారి ప్రధాని పదవి చేపట్టారు. నాటి నుంచి వరుసగా మూడోసారి కూడా బీజేపీ గెలుపులో మోదీ కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి మోదీ తర్వాత దేశాన్ని పరిపాలన చేసే ప్రధాని పదవిలో కూర్చునే నేత ఎవరూ అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో జర్నలిస్ట్ శ్రితమా బోస్ చేసిన విశ్లేషణ ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది.
Also Read : వైసీపీ క్యాడర్ లో కేసీఆర్ జోష్.. పండగే..!
శ్రితమ్ బోస్ తన విశ్లేషణలో మోదీ తర్వాత ప్రధాని పదవి కోసం నలుగురి పేర్లు ప్రస్తావించారు. ఆ నలుగురిలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు.. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారని శ్రితమ్ బోస్ వ్యాఖ్యానించారు. నిజానికి ప్రధాని పదవి కోసం బీజేపీలోనే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, యోగీ ఆదిత్యానాథ్‌తో పాటు జేపీ నడ్డా పేరు కూడా ప్రధాని పదవి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు బాగానే వినిపిస్తోంది. అయితే రాయిటర్స్ మాత్రం వీరి పేర్లు ప్రస్తావించలేదు. ఎవరూ ఊహించని రీతిలో చంద్రబాబు, లోకేష్ పేర్లు ప్రస్తావించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి రాయిటర్స్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆ సంస్థ ఇప్పుడు లోకేష్‌ను ప్రధాని రేసులో ఉన్నట్లు వ్యాఖ్యానించడం.. హాట్ టాపిక్.

