Sunday, September 20, 2026 01:06 AM
Sunday, September 20, 2026 01:06 AM

అమెరికన్ల ఉద్యోగాలపై జేడి వాన్స్ సంచలనం..!

ఎన్నో దేశాల టెక్ నిపుణులకు కలగా ఉండే హెచ్ 1 బీ వీసా విషయంలో అమెరికా సర్కార్ అనుసరిస్తోన్న వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిణామాలు ఆందోళన కలిగించాయి. అమెరికన్ లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదనే విమర్శల నేపధ్యంలో.. ట్రంప్ సర్కార్.. హెచ్ 1 బీ వీసాల ఫీజులను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీనితో హెచ్ 1 బీ వీసాతో అమెరికాలో అడుగు పెట్టాలి అంటే కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

Also Read : గిల్ కు మరో షాక్..? సెలెక్టర్ లు సంచలనం..!

ఇదిలా ఉంచితే.. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమెరికన్ కార్మికులను గౌరవించిన చర్యగా అభివర్ణించారు. వలస, ఉపాధి విధానం అనేది నైతికంగా ఉండాలన్నారు. అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలను విదేశాలకు ఇస్తున్నాయని మండిపడ్డారు. మానవ శ్రమను తాము గౌరవిస్తున్నామని, అందుకే అమెరికన్ ఉద్యోగాలను విదేశాలకు రవాణా చేసే కార్పొరేషన్లను తాము శిక్షిస్తాం అంటూ హెచ్చరించారు. అమెరికాలోని ప్రతి కార్మికుడు గౌరవం, ఉపాధి అవకాశాలకు అర్హుడని పేర్కొన్నారు.

Also Read : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. జగన్ డబుల్ గేమ్..!

అమెరికన్ కార్మికులను కంపెనీలు పక్కన పెట్టడాన్ని అడ్డుకునేందుకు హెచ్ 1 బీ వీసాలను పరిమితం చేసామని తెలిపారు. అమెరికన్లను నియమించుకోకుండా.. చౌకగా ఉండే విదేశీ ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం తప్పు అని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ విధానం.. అమెరికా ఫస్ట్ అన్నారు. ఇప్పుడు జెడి వాన్స్ ఆ వాదనలను సమర్ధించిన నేపధ్యంలో.. ట్రంప్ తర్వాత ఆయనే అధ్యక్షుడిగా పోటీ చేస్తారు అనే కామెంట్స్ వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్