Wednesday, August 5, 2026 05:23 PM
Wednesday, August 5, 2026 05:23 PM

ఎమ్మెల్యేలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. టార్గెట్ ఫిక్స్..?

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయం మొదలుపెట్టారు. ఇప్పటివరకు చూసి చూడనట్లు వ్యవహరించిన పవన్.. ఎమ్మెల్యేల విషయంలో కఠినంగానే ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వరుసగా రెండు మూడు రోజుల నుంచి ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యేల పనితీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కనీసం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహించడం లేదని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సరైన ప్రచారం చేయడం లేదని, ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానం ఇవ్వటం లేదని ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేశారు.

Also Read : టీడీపీ తో పొత్తుపై పవన్ కీలక కామెంట్స్

ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు పవన్ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే ఆరు నెలల పాటు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో, ప్రతిపక్షాలు విమర్శలకు సమాధానం ఇచ్చే అంశంలో, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంలో.. తాను ప్రతి ఒకటి మానిటరింగ్ చేస్తానని, నియోజకవర్గాల కార్యకర్తలతో ఈ ఆరు నెలల్లో మాట్లాడతానని, కార్యకర్తలు, ప్రజలు చెప్పిన విషయాలను తాను సీరియస్ గా తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా సరే విజయవాడలో తిష్ట వేస్తున్న ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం.

Also Read : చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి.. నలిగిపోతున్న జగన్..!

నియోజకవర్గాల సమస్యల కోసం అధికారులను, మంత్రులను కలిసే అవకాశం ఉన్నప్పటికీ కలవకుండా.. విజయవాడలోనే ఉండి ఏం చేస్తున్నారని ఎమ్మెల్యేలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా హైదరాబాదులోనే ఉండటంపై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మెడికల్ కాలేజీలో విషయంలో వైసీపీ విమర్శలు చేస్తున్నప్పుడు,నియోజకవర్గాల్లో మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించలేదని కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అడుగులు వేస్తున్నప్పుడు.. నియోజకవర్గాల్లో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలతో, స్థానిక నాయకత్వంతో ఎందుకు చర్చించడం లేదని కూడా పవన్ ఎమ్మెల్యేలను నిలదీసినట్లు తెలుస్తోంది. తన వద్ద ప్రతి ఒక్క ఎమ్మెల్యే సమాచారం ఉందని, కనీసం తమ నియోజకవర్గానికి రోడ్డు కావాలని కూడా ఎమ్మెల్యేలు వచ్చి తనను కలవడం లేదని, సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్యేలు యాక్టివ్ కావడం లేదంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్