Sunday, March 22, 2026 03:40 PM
Sunday, March 22, 2026 03:40 PM

బ్రేకింగ్: క్రికెట్ కు సూర్య కుమార్ గుడ్ బై..? బోర్డు క్లారిటీ..?

భారత జట్టులో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా విమర్శలను ఎదుర్కొంటున్న టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ విషయంలో బోర్డు పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు అతను ఆశించిన స్థాయిలో రాణించలేదు. చిన్న జట్లపై మినహా పెద్దజట్లపై అతను ఆడింది కూడా లేదు. కెప్టెన్ గా కొంత సక్సెస్ అవుతున్నప్పటికీ.. ఆటగాడిగా మాత్రం ఫెయిల్ అవ్వడంతో అతను జట్టులో ఉండకూడదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వాటి జాతీయ మీడియా కూడా ఓ రేంజ్ లో సూర్య కుమార్ యాదవ్ పై విమర్శలు చేస్తోంది.

Also Read : చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి.. నలిగిపోతున్న జగన్..!

ఒక పక్కన వందలాదిమంది యువ క్రికెటర్లు జట్టులో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. సూర్య కుమార్ యాదవ్ విషయంలో ఎందుకంత సానుకూలంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియా తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియా టుడే ఓ కీలక కథనాన్ని ప్రచురించింది. వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉండవచ్చని అభిప్రాయబడింది. లేదంటే కెప్టెన్సీ బాధ్యతలు నుంచి అతను తప్పుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. టి20 వరల్డ్ కప్ జట్టును నేడు ప్రకటించారు.

Also Read : దేవాలయాలకు టీటీడీ అద్భుత కానుక..!

అయితే సూర్య కుమార్ యాదవ్ ను టి20 వరల్డ్ కప్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. కానీ అతను సరిపోడని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచి దూకుడు మీద ఉన్న టీమిండియా.. ఈసారి హార్దిక్ పాండ్యా సారథ్యంలో అడుగు డిమాండ్ వినపడింది. హార్థిక్ పాండ్యా నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో.. అందరికీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ లు వినపడుతున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరైన ప్రదర్శన లేని ఆటగాళ్ల విషయంలో కఠినంగా ముందుకు వెళ్లకపోతే భవిష్యత్తులో భారత జట్టు మరింత పతనం అయిపోయాయే అవకాశం ఉందని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. అయితే టి20 వరల్డ్ కప్ జట్టులో గిల్ ను ఎంపిక చేయకపోవడంతో అతని టి 20 కెరీర్ ముగిసినట్లే అంటున్నాయి క్రికెట్ వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్