Wednesday, August 5, 2026 08:52 PM
Wednesday, August 5, 2026 08:52 PM

పాపం నిధీ.. రాజాసాబ్ హీరోయిన్ కు చుక్కలు..!

అభిమానుల అతి చేష్టల కారణంగా సినిమా నటులు అనేక సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. సినిమా వాళ్ళతో ఫోటోలు దిగాలని, వాళ్ళ పక్కన కనపడాలని హడావుడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అతి అభిమానం ఓ హీరోయిన్ ప్రాణాల మీదకు తెచ్చింది. అసలు ఏంటీ ఈ స్టోరీ అనేది ఒకసారి చూస్తే.. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ది రాజా సాబ్’ సినిమాలోని ‘సహానా సహానా’ పాట రిలీజ్ కార్యక్రమంలో నటి నిధి అగర్వాల్‌ పాల్గొంది. అనంతరం ఆమె బయటకు వెళ్ళే సమయంలో అభిమానులు చుట్టూ గుమిగూడి ఇబ్బంది పెట్టిన వీడియోలు బయటకు వచ్చాయి.

Also Read : జైలులో రవి.. ఆగని పైరసీ..!

కారు వరకు వెళ్ళడం కూడా కష్టంగా మారింది. బౌన్సర్లకు కూడా ఇది ఇబ్బందిగానే మారింది. ఎట్టకేలకు ఆమె సురక్షితంగా కారు ఎక్కినా.. సెలబ్రిటీల భద్రత, ఈవెంట్ నిర్వహణ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆఫ్రికా అడవుల్లో హైనాల మాదిరిగా ఆమెపై పడిపోయారని, బౌన్సర్ సంస్కృతి గురించి విమర్శించే వారు.. నిధి అగర్వాల్ పరిస్థితి చూడాలని కోరుతున్నారు. అక్కడ అందరూ అబ్బాయిలే ఉండటం, ఈవెంట్ నిర్వాహకులు సరైన భద్రత కల్పించకపోవడం విమర్శలకు దారి తీసింది.

Also Read : బీఎస్ 3 వాహనాలపై సుప్రీం సంచలన ఆదేశాలు..!

హీరోయిన్ పరిస్థితి చూసిన ఇతర నటులు కూడా సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ నిర్వహించే వారు సేలేబ్రేటీలు వచ్చినప్పుడు భద్రతపై దృష్టి సారించాలని, అభిమానులు కూడా మానవత్వం ప్రదర్శించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై నిధీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని మరికొందరు కోరుతున్నారు. స్టార్ హీరోల భద్రతపై దృష్టి పెట్టే నిర్మాతలు.. హీరోయిన్లను ఎందుకు చులకనగా చూస్తున్నారు అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్