వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ఆయన సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది. మేజర్ మినరల్ అయిన సున్నపురాయి లీజులను ఈ-వేలం ద్వారానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ..జగన్ ప్రభుత్వం దరఖాస్తు విధానంలో 2 లీజులను భారతి సిమెంట్‌కు మంజూరు చేసింది.
భారతి సిమెంట్స్ అధికారులు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఆ సంస్థ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాధికారులు న్యాయపరంగా ముందుకెళ్తున్నారు. భారతి సిమెంట్స్ ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన 2 లీజులను రద్దు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read : బాలయ్యకు ఫిదా అయిపోయిన ఇండియా టుడే
2015, 2021ల్లో కేంద్రం తీసుకొచ్చిన సవరణల ప్రకారం.. వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఉన్నా, భారతి సిమెంట్ గతంలో దరఖాస్తు చేసుకున్న రెండు లీజులను జగన్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కేటాయించి, నిబంధనలను ఉల్లంఘించింది. మొదట కడప జిల్లా కమలాపురం మండలంలోని 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలోని 235.56 ఎకరాల్లో రెండు సున్నపురాయి లీజుల కోసం రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ గతంలో దరఖాస్తుచేసుకోగా, దానికి 2008లో అప్పటి YSR ప్రభుత్వం LOI – లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీచేసింది. మైనింగ్ ప్లాన్‌కు అనుమతి, పర్యావరణ అనుమతులు వంటివి అన్నీ తెచ్చుకుంటే..లీజులు మంజూరు చేస్తారు. అయితే భారతి సిమెంట్ అన్ని అనుమతులూ పొందలేకపోయింది. అలాగే LOI రఘురామ్ సిమెంట్ పేరిట జారీచేస్తే…లీజు భారతి సిమెంట్ పేరిట మారిన విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయలేదు.
భారతి దారిలోనే ACC, రామ్‌కోకు లీజులు – మరోవైపు భారతి సిమెంట్ తరహాలోనే కడప జిల్లా మైలవరం మండలంలోని 997 హెక్టార్లలో సున్నపురాయి లీజు కోసం దరఖాస్తు చేసుకున్న ACC సిమెంట్స్‌కు 2023 సెప్టెంబరులో లీజు మంజూరుచేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. అదే కారణాన్ని భారతి సిమెంట్‌కు కూడా చూపించి.. గతేడాది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సరిగ్గా నెల ముందు భారతి సిమెంట్‌కు రెండు లీజులను జగన్ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక, NTR జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని రామ్‌కో సిమెంట్‌కు 2008లో 267.30 ఎకరాల్లో సున్నపురాయి లీజుకు LOI జారీకాగా, తర్వాత అది కూడా కేంద్ర ప్రభుత్వ సవరణ మేరకు లీజు పొందలేకపోయింది. ఈ సంస్థకు కూడా జగన్ ప్రభుత్వం గతేడాది మార్చిలో లీజు మంజూరు చేసింది.
Also Read : పవన్ సూపర్.. భయపడేది లేదు: చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
భారతి సిమెంట్‌కు 2 లీజులు, ACC, రామ్‌కో సిమెంట్‌కు చెందిన ఒక్కో లీజులకు మైనింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అవి కేంద్ర గనులశాఖ పరిధిలో ఉండే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) పరిశీలనకు వెళ్లాయి. 2015 తర్వాత వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టమైన ఆదేశాలుంటే.. 2023, 2024లో మంజూరు చేసిన ఈ 4 లీజులను..దరఖాస్తు విధానంలో ఎలా మంజూరు చేశారని IBM ప్రశ్నించింది. ఇదే విషయాన్ని కేంద్ర గనులశాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన కేంద్ర గనులశాఖ..రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయసలహా తీసుకొని 4 లీజులనూ రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. నోటీసులకు 3 సంస్థలు వివరణ ఇచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిసింది.

