Sunday, September 20, 2026 03:42 AM
Sunday, September 20, 2026 03:42 AM

బ్రేకింగ్: అనర్హతపై స్పీకర్ సంచలన తీర్పు..!

తెలంగాణాలో ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో ఏ పరిణామాలు ఉండబోతున్నాయనేది గత కొన్నాళ్ళుగా ఆసక్తి పెరిగిపోయింది. ఈ విషయంలో సుప్రీం కోర్ట్ కూడా జోక్యం చేసుకోవడంతో స్పీకర్ వారిపై అనర్హత పిటీషన్ వేస్తారా అనేది ఉత్కంట రేపింది. నెల రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్ట్ స్పష్టం చేయడంతో స్పీకర్ కార్యాలయం రోజు వారీ విచారణ చేపట్టింది. మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. దీనితో వారిని సస్పెండ్ చేస్తారని అందరూ భావించారు.

Also Read : జగన్‌కు ఉహించని షాక్ ఇచ్చిన బాబు సర్కార్

తాజాగా దీనిపై తెలంగాణా స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటీషన్ లను తెలంగాణా స్పీకర్ కొట్టేసారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై ఆరోపణలను తోసి పుచ్చారు. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవన్న స్పీకర్‌.. అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌, ప్రకాష్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌కు ఊరటను ఇచ్చారు. దీనితో కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో ఆసక్తి మొదలైంది.

Also Read : తెలంగాణాలో మరో ఎన్నికల సందడి..!

దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడంతో ఆయన పార్టీ మారారు అనే స్పష్టత వచ్చింది. దీనితో ఆయననుసస్పెండ్ చేయడం ఖరారు అయింది. అలాగే కడియం శ్రీహరి విషయంలో సస్పెన్షన్ వేటు పడే అవకాశం కనపడుతోంది. ఒక్కసారి వేటు పడితే మరో ఆరేళ్ళ పాటు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. అటు సుప్రీం కోర్ట్ కూడా ఈ విషయంలో వాళ్లకు వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చే సంకేతాలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్