తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తోంది. జన గణనతో సంబంధం లేకుండానే పునర్ విభజన చేసే అవకాశం ఉన్నట్లుగా, కేంద్రం ఈ విషయంలో పట్టుదలతో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పునర్ విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపును ముందుకు తీసుకువెళ్లేలా వడివడిగా అడుగులు వేస్తోంది.
వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే చేయాలని కృత నిశ్చయంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్ విభజన చేస్తామని ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికలు డీలిమిటేషన్‌తోనే ఉంటాయని వెల్లడించినట్లు స్పష్టం అవుతోంది. పలు రాష్ట్రాలకు చెందిన కొంత మంది ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అనుమానాలు అవసరం లేదని, జాగ్రత్తగా పని చేసుకోవాలని చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇప్పటికే కసరత్తు నడుస్తున్నట్లుగా ఎంపీలతో అమిత్ షా అన్నట్లు సమాచారం.
Also Read : బ్రేకింగ్: టీడీపీలో పదవుల పండుగ
పునర్ విభజన ప్రక్రియ చేయాల్సిన విషయంలో కేంద్రానికి పూర్తిగా క్లారిటీ ఉందని, ఇప్పటికే ఆలస్యం అయిందని, వచ్చే ఎన్నికల్లో చేసే ముందుకు వెళ్తామని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల సేకరణకు, డీలిమిటేషన్‌కు సంబంధం లేదు అని అమిత్ షా వివరించినట్లుగా తెలుస్తోంది. జనాభా లెక్కలు పూర్తి కాకపోయినా నియోజకవర్గాల పునర్ విభజన సాధ్యం అవుతుందని ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అవసరమైతే గత జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని అమిత్ షా అన్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెంచాల్సి ఉండగా పదేళ్లుగా అలాగే ముందుకు వెళ్తున్నారు. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాలు పెంచుతారని ఇంతకాలం భావించారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునర్ విభజనపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీ, తెలంగాణలో పునర్ విభజనకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. దీనిపై 2027 తర్వాత అధికారికంగా డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : మూతపడుతున్న థియేటర్లు.. కారణాలివే..!
లోక్‌సభ నియోజకవర్గాల పునర్ విభజన పై కసరత్తు ప్రారంభమైందని అమిత్ షా వెల్లడించినట్లు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం జరుగుతుందనే ఆందోళనను పరిగణనలోకి తీసుకొని, నియోజకవర్గాలపైన పునరాలోచన చేస్తున్నట్లు ఎంపీలతో అమిత్ షా అన్నట్లు తెలుస్తోంది. డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ త్వరగానే పూర్తి అవుతుందని, ఎంపీలతో పార్లమెంట్‌లో జరిగిన సమావేశంలో డీలిమిటేషన్ పై అమిత్ షా వ్యాఖ్యానించినట్లు సమాచారం. జనాభా లెక్కల సేకరణకు ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ చేయనున్నారు. డీలిమిటేషన్ పై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. రోడ్ మ్యాప్ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
డీలిమిటేషన్‌లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే యోచనలో ఉన్నారు. సమయం అనుకూలంగా ఉంటే లోక్‌సభ నియోజకవర్గాల పునర్ విభజనను కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. 2027లో ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. అప్పటి వరకు జన గణన, కుల గణనను పూర్తి చేసి, వాటి ఆధారంగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

