Sunday, September 20, 2026 02:06 AM
Sunday, September 20, 2026 02:06 AM

ఐపీఎల్ మినీ వేలం.. అతనిపై కోట్ల వర్షం..?

ఐపీఎల్ వేలంపాట అనగానే క్రికెటర్లు అందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కోట్లు కురిపించే ఈ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ఈ నెలలో జరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకునేందుకు కష్టపడుతున్నారు. మొత్తం 71 మంది ఆటగాళ్లను ఈ మినీ వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందులో 31 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. కలకత్తా వద్ద దాదాపు 65 కోట్లు ఉండగా హైదరాబాద్ వద్ద 25 కోట్లకు పైగా పర్స్ ఉంది. దీనితో ఏ ఆటగాడికి ఎక్కువ మొత్తం చెల్లిస్తారు అనేదానిపైనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా స్వదేశీ ఆటగాళ్ల విషయంలో ఫ్రాంచైజీలు ఏ అడుగులు వేయబోతున్నాయో చూడాలి.

Also Read : అంబటీ నీకో దండం.. బాబు.. ఫైర్ అవుతున్న వైసీపీ నేతలు

ఆది అలా ఉంచితే ఇప్పుడు.. టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ విషయంలో భారీ ఆశలు పెట్టుకున్నాడు. జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో.. ఎలాగైనా సరే ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వాలని కష్టపడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిలకడగా పరుగులు చేస్తున్నాడు ఈ ముంబై ఆటగాడు. ఫిట్నెస్ విషయంలో సర్ఫరాజ్ చాలా మెరుగయ్యాడు. ఈ మినీ వేలంలో అతను భారీ ధర పలికే అవకాశాలు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. 12 నుంచి 14 కోట్లు అతనిపై ఖర్చు చేసే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read : పీవీ మౌన కుమార్.. వంద ప్రశ్నలకు మౌనమే..?

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అతనిని కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చని ప్రచారం ఊపందుకుంది.. గతంలో ఢిల్లీ, పంజాబ్ జట్లకు అతను ఆడాడు. ఇక ఈ సీజన్ లో అతనిని.. బెంగళూరు దాదాపుగా కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. జాతీయ జట్టులోకి రావాలని ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం లేకపోవడంతో ఐపీఎల్ మీద దృష్టి పెట్టాడు. ఇతనితోపాటుగా మరికొంతమంది ఆటగాళ్లు కూడా ఐపీఎల్ పై దృష్టి సారించి కష్టపడుతున్నారు. ఆకాష్ దీప్ కూడా భారీ ధర పలికే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి క్రికెట్ వర్గాలు. హైదరాబాద్ ఎక్కువగా హిట్టర్ల కోసం చూస్తున్న నేపథ్యంలో సర్ఫరాజ్ విషయంలో ఏ అడుగులు వేస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్