Thursday, May 7, 2026 08:18 AM
Thursday, May 7, 2026 08:18 AM

పీవీ మౌన కుమార్.. వంద ప్రశ్నలకు మౌనమే..?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలమైంది. సాక్షాత్తు ఓ ఎంపీని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేయడంపై అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దీనిపై 2024 లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. అందులో ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కూడా ఉన్నారు. తాజాగా ఆయనను ఈ కేసులో గుంటూరులో సిసిఎస్ పోలీసులు విచారించారు.

Also Read : మంత్రి లోకేష్‌కు ఆ విషయంలో ఇబ్బందులు..!

ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించారు. రఘు రామ కృష్ణంరాజును కస్టడీలో ఏం ఆశించి కొట్టారని.. ఆయనను కొట్టేందుకు వచ్చిన వ్యక్తులు ఎవరని, ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటని పోలీసులు ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు సిఐడి కస్టడీలోకి తీసుకున్న తర్వాత రఘురామకృష్ణమరాజును ఎందుకు చిత్రహింసలు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అలా చేయమని మీకు అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా..? ముసుగులు ధరించి వచ్చి ఆయనను కొట్టింది ఎవరు..? గుండెల పై కూర్చుని ఊపిరాడకుండా చేయాలని అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చారా..? కొట్టడానికి మనుషులను ఎవరు పంపించారు..?

Also Read : థియేటర్లకు అఘోరాలు.. నార్త్ లో ఊగిపోతున్న శివ భక్తులు

వ్యక్తిగతంగా మీకు రఘురామ కృష్ణంరాజును ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఒకవేళ మీకు తెలియకుండా కింది వాళ్ళు అలా చేశారని భావిస్తే వారిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారు..? ప్రాథమిక విచారణ చేసిన సునీల్ నాయక్ ను గుంటూరు సిఐడి కార్యాలయానికి ఎందుకు పంపించారు..? అతని ఆధ్వర్యంలో కొట్టించడానికి పంపించారా..? ఇలా ప్రశ్నలు వర్షం కురిపిస్తే.. పీవీ సునీల్ మాత్రం కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చి మిగిలిన వాటికి మౌనంగా ఉండిపోయారట. కొన్ని ప్రశ్నలకు రికార్డుల్లో సమాధానాలు ఉంటాయని, అసలు తనకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించారని.. పోలీసు వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్