Sunday, March 22, 2026 02:55 PM
Sunday, March 22, 2026 02:55 PM

మూతపడుతున్న థియేటర్లు.. కారణాలివే..!

సినిమా.. సామాన్యుడు మొదలు బిలియనీర్ వరకు అందరికీ ఉండే ఎంటర్‌టైన్‌మెంట్. గతంలో ప్రతి ఒక్కరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే వాళ్లు. ఇప్పటికీ కొంత మంది ప్రతి వారం సినిమాను థియేటర్‌లో చూడటం ఒక సరదాగా భావిస్తారు కూడా. మన భారతదేశంలో సినిమా మాత్రమే అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్. సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు.. దేశానికి ప్రధాన ఆదాయ వనరు కూడా. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. వందల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఇలాంటి సినిమా ప్రదర్శించే థియేటర్లు మాత్రం ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదురుకుంటున్నాయి.

Also Read : గ్రామాల్లో కమలానికి దిక్కు ఎవరు

గతంలో సినిమాల ప్రదర్శనకు ప్రత్యేకంగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు మాల్స్‌లోనే స్క్రిన్స్ పెట్టడంతో.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. సినిమా ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో.. థియేటర్‌లో ప్రదర్శించే సినిమా టికెట్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో లగ్జరీ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో.. వాటితో సింగిల్ స్క్రీన్ థియేటర్లు పోటీ పడలేకపోతున్నాయి. దీంతో సింగిల్ స్క్రీన్ సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే.. 25 ఏళ్ల కాలంలో 75 శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడినట్లు సినీ పరిశ్రమ వర్గాల తాజా నివేదిక వెల్లడించింది.

1995లో దేశవ్యాప్తంగా 23,500 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా.. 2005 నాటికి 12,500.. 2015 నాటికి 9,500 పడిపోగా… తాజాగా 2025 నాటికి కేవలం 6,500 మాత్రమే ఉన్నాయని ట్రేడ్ టాక్ సంస్థ నివేదిక ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్న రాష్ట్రాల్లో వెయ్యి థియేటర్లతో ఏపీ అగ్రస్థానంలో ఉండగా.. 776 థియేటర్లతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో కేవలం 3 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా… పంజాబ్‌లో అయితే కేవలం 2 మాత్రమే ప్రస్తుతం సినిమాలు ప్రదర్శిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

Also Read : మంత్రి లోకేష్‌కు ఆ విషయంలో ఇబ్బందులు..!

ఇందుకు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం, భూమి విలువ, మాల్స్ కల్చర్‌కు ప్రజలు అలవాటు పడటం, ఓటీటీల ప్రభావం, అధిక నిర్వహణ ఖర్చులతో పాటు ప్రీమియం ఖర్చులను పెరిగిపోయాయి. ఈ కారణాలతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా మూతపడుతున్నాయనేది ట్రేడ్ టాక్ సంస్థ నివేదిక. మల్టిప్లెక్స్ కల్చర్‌ వల్ల ప్రజలు థియేటర్లకు రావడం లేదు. అయితే ఇటీవల కొన్ని తెలుగు సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.99 కే టికెట్ ధరలు పెట్టడం కొంత మేలు జరుగుతుంది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మనుగడ సాగించాలంటే.. ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని.. ట్యాక్స్ హాలిడే వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్