Sunday, March 22, 2026 07:27 AM
Sunday, March 22, 2026 07:27 AM

థియేటర్లకు అఘోరాలు.. నార్త్ లో ఊగిపోతున్న శివ భక్తులు

హిందుత్వ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు.. గత రెండు మూడు ఏళ్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ సినిమాలకు ప్రయారిటీ కూడా ఎక్కువగా ఇవ్వటంతో.. ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతోంది. శివుడి నేపథ్యంలో వచ్చే సినిమాలకు డిమాండ్ భారీగా ఉంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సీక్వెల్ కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు తొలి రెండు మూడు రోజులు భారీగా వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే వందకోట్ల మార్క్ అఖండ 2 సినిమా దాటినట్లు తెలుస్తోంది. సినిమాపై ఉన్న అంచనాలు కూడా కాస్త ప్లస్ అయ్యాయి.

Also Read : బాక్సాఫీస్ వద్ద అఖండ తాండవం..!

ఇది ఇలా ఉంచితే నార్త్ ఇండియాలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ బాలీవుడ్ మీడియాను ఆశ్చర్యపరుస్తోంది. అఘోర పాత్ర లో బాలయ్య దుమ్ము రేపటంతో.. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాల్లో సినిమాకు ఊహించని క్రేజ్ వస్తోంది. ఈ సినిమాకు శివ భక్తులు, అఘోరాలు.. వెళ్ళిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిచోట్ల అఘోరాలు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. బాలీవుడ్ సినిమాలను విమర్శించే హిందూ వాదులు ఈ సినిమాకు ప్రమోషన్ చేయడం గమనార్హం. బాలీవుడ్ ఇకనైనా కళ్ళు తెరవాలంటూ సినిమాలోని కొన్ని సన్నివేశాల గురించి పోస్టులు పెడుతున్నారు.

Also Read : మంత్రి లోకేష్‌కు ఆ విషయంలో ఇబ్బందులు..!

ఇక బాలయ్య 65 ఏళ్ల వయసులో కూడా ఆ స్థాయిలో నటించడంతో.. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఖాన్ త్రయం మాయలో పడి.. బాలీవుడ్ డైరెక్టర్లు హిందూ సినిమాలను అవమానించారని మరికొంతమంది విమర్శిస్తున్నారు. గతంలో కూడా అఖండ మొదటి పార్ట్ కు ఇదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకు కూడా భారీగా అఘోరాలు థియేటర్లకు వెళ్లారు. కాంతారా వంటి సినిమాలకు కూడా బాలీవుడ్ పెద్ద పీట వేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా జరగటం కలిసి వచ్చే విషయం. ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్