మంత్రి లోకేష్‌ను మేధావులు హెచ్చరిస్తున్నారు. అధికారం లేనప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఎలా వుంటారో.. మంత్రి లోకేష్ గారు కూడా అదే విధంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో అడుగు ముందుకు వేస్తున్న మరి కొందరు.. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు కూడా. తండ్రి చంద్రబాబునే మంత్రి లోకేష్ ఆదర్శంగా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు మార్లు వెల్లడించారు కూడా. పనిలో చంద్రబాబుతో పోటీ పడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు కూడా
Also Read : గరం గరం గన్నవరం..!
అయితే ప్రస్తుతం లోకేష్ తీరు వల్ల టీడీపీ నాయకుల, కార్యకర్తల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందనేది రాజకీయ పరిశీలకులతో పాటు మేధావులు, సీనియర్ జర్నలిస్టుల మాట కూడా. ఇక మరికొందరైతే.. టీడీపీలో లోకేష్ పైన వ్యతిరేకత వస్తుందని.. కార్యకర్తల నమ్మకం కూడా కోల్పోతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా లోకేష్ చుట్టూ చేరిన కొంత మందే కారణమంటున్నారు కూడా. లోకేష్ పేరు చెప్పి.. బయట వాళ్లు చేస్తున్న పనులే ఇందుకు ఉదాహరణ అంటున్నారు. నిజానికి ఇవేవీ లోకేష్ వరకు వెళ్లడం లేదు. చాలా విషయాలు లోకేష్ చుట్టూ ఉన్న కోటరీ దగ్గరే ఆగిపోతున్నాయి. దీని వల్ల చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కూడా.
గతంలో చంద్రబాబు చుట్టూ కూడా ఇలాంటి కోటరీ చేరిందని.. అందుకే ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయని గుర్తు చేస్తున్నారు. లోకేష్ ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఆయన కూడా అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కూడా. కూటమి ప్రభుత్వం గెలుపులో టీడీపీ ఘన విజయంలో లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర చాలా కీలకం. వైసీపీ ప్రభుత్వ వేధింపులకు ధీటుగా లోకేష్ పాదయాత్ర పూర్తి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ పేరుతో ప్రజల నుంచి స్వయంగా సమస్యలు స్వీకరిస్తున్నారు కూడా. అయితే కొన్ని విషయాలు మాత్రం లోకేష్‌కు చెడ్డపేరు తీసుకువస్తున్నాయి.
Also Read : ఏం చేస్తున్నారు..? ఎమ్మెల్యేలపై జనసేనాని ఫోకస్..!
ఇలాంటి వాటిల్లో ప్రధానమైనది చిలకలూరిపేట థియేటర కబ్జా వ్యవహారం. లోకేష్‌తో అపాయింట్‌మెంట్ పేరు చెప్పి తన వద్ద రూ.20 లక్షలు తీసుకున్నారనేది థియేటర్ యజమాని పదే పదే చేస్తున్న ఆరోపణ. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు తాజాగా గన్నవరం నియోజకవర్గం ద్వితీయ శ్రేణి నేతలు కూడా లోకేష్ పైనే విమర్శలు చేస్తున్నారు. ఇది అటు పార్టీకి, ఇటు లోకేష్‌కు కూడా చెడ్డ పేరు తీసుకువస్తుంది.
లోకేష్ మంత్రి అయిన తర్వాత క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇదే సమయంలో సందర్శకులను నేరుగా కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కావటం లేదనేది ప్రధాన ఆరోపణ. పార్టీ కార్యకర్తలు కూడా సందర్శకులు కలిసే సమయంలోనే కలవాలని.. ప్రత్యేకంగా కలవటం కుదరదని మంత్రి లోకేష్ చెప్పారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి లోకేష్ ఎప్పుడూ ఈ మాట చెప్పలేదు. చాలామంది కార్యకర్తల దగ్గర లోకేష్ ఫోన్ నంబర్ ఉంది. ఏ సమస్య వచ్చినా సరే.. వాట్సప్ ద్వారా కూడా జవాబిస్తున్నారు లోకేష్. కానీ కోటరీ తీరు వల్ల లోకేష్‌కు చెడ్డపేరు వస్తుందనేది ప్రధాన ఆరోపణ.
Also Read : బాక్సాఫీస్ వద్ద అఖండ తాండవం..!
ఇందుకు ఏకైక పరిష్కారం.. పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం.. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించడమే అంటున్నారు. ఓ వైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా వన్ – టూ – వన్ నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇదే పని లోకేష్ కూడా చేయాలనేది కార్యకర్తలు, నేతల మాట. మంత్రి లోకేష్ చుట్టూ ఉన్న కోటరీ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కూడా. దీనిని లోకేష్ సరిచేసుకోవాలని, అలాంటి వారిని పక్కన పెట్టాలనేది మేధావుల సూచన. ఈ విషయంపై తక్షణమే లోకేష్ స్వయంగా రంగంలోకి దిగాలని సూచిస్తున్నారు.

