Sunday, September 20, 2026 04:10 AM
Sunday, September 20, 2026 04:10 AM

బ్రెస్ట్ క్యాన్సర్ టీకాలో సంచలన అడుగు..!

క్యాన్సర్లలో అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి అనేక అవగాహనా కార్యక్రమాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కీలక అడుగు పడింది. అత్యంత దూకుడుగా వ్యాపించే ఈ క్యాన్సర్ కు టీకా కనిపెట్టే పనిలో ఉన్న పరిశోధకులు కీలక ప్రయాణం మొదలుపెట్టారు. ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి.

Also Read : లోకేష్ కమిట్మెంట్ కు షాక్ అయిన టీడీపీ నేతలు

శాన్ ఆంటోనియో బ్రెస్ట్ క్యాన్సర్ సింపోజియంలో ప్రచురించిన ఓ నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్లీవ్‌ ల్యాండ్ క్లినిక్ పరిశోధకులు ఆల్ఫా-లాక్టాల్బుమిన్ ను విడుదల చేసే.. కణాలకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూపొందించిన టీకా యొక్క చివరి దశ మొదటి.. క్లినికల్ ట్రయల్ ఫలితాలను ప్రచురించారు. ఈ మొదటి-మానవ టీకా ట్రయల్ డేటా ప్రకారం, ట్రయల్ లో పాల్గొన్న వారిలో దాదాపు 74% మంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసారు అని తెలిపింది.

Also Read : బాలకృష్ణ పై ఎందుకీ ఏడుపు…? ఒక్కటైన మెగా ఫ్యాన్స్, వైసీపీ..?

సిఫార్సు చేయబడిన మోతాదులో టీకా సురక్షితమైనదని, క్యాన్సర్ ను కట్టడి చేసే విషయంలో సమర్ధవంతంగా ఎదుర్కోగలదు అని గుర్తించారు. చికిత్స కూడా కష్టమైన ఈ రోజుల్లో ఈ పరిణామం ఆశాజనకమే. మొదటి దశలో.. క్యాన్సర్ మళ్ళీ తిరిగి వస్తుందా లేదా రోగి శరీరంలో ఇంకా క్యాన్సర్ కణాలు ఉన్నాయా అనే దానిపై స్పష్టత రాలేదు. రొమ్ము క్యాన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను ఈ పరిశోధనల్లో ఎంపిక చేసారు. మరో రెండు దశల్లో దీని ట్రయల్స్ జరగనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్