ఏదేమైనా భారత క్రికెట్ లో పరిణామాలు రోజు రోజుకి ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అంటూ క్రికెట్ అభిమానుల్లో ఆ ఆందోళన కనపడుతోంది. అటు టీం సభ్యుల్లో సైతం పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగానే ఉన్న మాట వాస్తవం. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో బోర్డు ఎలా ఆలోచిస్తుందో ఇప్పటికీ జనాల్లో క్లారిటీ లేదు. వాళ్ళను ఎలాగైనా సరే బయటకు పంపాలనే గంభీర్ ప్రయత్నాలను బోర్డు అడ్డుకుంటుందా లేదా సమర్ధిస్తుందా అనేది చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
Also Read : సొంత నిర్ణయాలు లేవ్.. ముగ్గురు ఐఏఎస్ లపై పవన్ ప్రశంశలు..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏటా 4 విభాగాలలో ఆటగాళ్లకు కాంట్రాక్ట్ లను రిలీజ్ చేస్తుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం.. దేశంలోని క్రికెటర్లను జాతీయ జట్టుకు ఆడే విధంగా, మరో జట్టుకు వెళ్లకుండా ఉండేందుకు తీసుకునే నిర్ణయం. సాధారణంగా ఈ కాంట్రాక్ట్ లో స్టార్ ప్లేయర్ లకు ఏ ప్లస్ కేటగిరిలో చోటు కల్పిస్తుంది. మూడు ఫార్మాట్ లలో ఆడే ప్లేయర్ కు భారీగా చెల్లిస్తూ ఉంటుంది బోర్డు. బోర్డు చివరిసారిగా 2025 ఏప్రిల్‌లో తన ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ లను రిలీజ్ చేసింది. అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటూ ప్రకటన చేశారు.
Also Read : రోకో డామినేషన్.. గంభీర్ కు మరో షాక్..!
కానీ వాళ్ళ కాంట్రాక్ట్ మాత్రం బోర్డు తగ్గించలేదు. ఇప్పుడు మాత్రం వారి జీతాల్లో కోత విధిస్తున్నట్టు ఓ వార్త సందడి చేస్తోంది. వాళ్ళు మూడు ఫార్మాట్ లలో ఆడకపోతే ఏడు కోట్లు గా ఉండే జీతాన్ని రెండు కోట్లు తగ్గించి 5 కోట్లు మాత్రమే ఇస్తారు. అంటే వాళ్ళ కాంట్రాక్ట్ లో ఏ ప్లస్ నుంచి ఏ కి తగ్గిస్తారు అనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. దీని వెనుక గంభీర్ హస్తం ఉందని, బోర్డుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లు కావడంతోనే బోర్డు వెనకడుగు వేస్తోందని కామెంట్స్ వినపడుతున్నాయి. వారి కారణంగా బోర్డుకు భారీ ఆదాయం వస్తున్న నేపథ్యంలో.. ఏం జరగబోతుందా అనే ఆసక్తి పెరిగిపోయింది.

