నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అఖండ తాండవానికి ముహూర్తం ఖరారు అయిందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. గత వారం రోజుల నుంచి ఈ సినిమా వ్యవహారం సంచలనంగా మారింది. విడుదల కావాల్సిన తేదీ ఎప్పుడో తెలియకపోవడంతో నందమూరి అభిమానులు సినిమా నిర్మాణ సంస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బాలకృష్ణ లాంటి అగ్ర హీరోను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థకు ఉన్న ఇబ్బందుల కారణంగా హీరోను ఇబ్బంది పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపించాయి.
Also read : ఇండిగో గోల.. అసలెందుకీ రగడ..?
దీంతో ఈ సినిమా ఈ నెలలో విడుదల కావడం కష్టమేననే అభిప్రాయాలు వినిపించాయి. ప్రముఖ బుకింగ్ యాప్స్ లో కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే సినిమాల జాబితాలో ఈ సినిమా లేకపోవడంతో ఫాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే గత రెండు రోజుల నుంచి సినిమా రిలీజ్ విషయంలో.. సైలెంట్ గా క్లారిటీ వస్తోంది. ఈనెల 12న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈనెల 12న సినిమా రిలీజ్ కావడానికి రంగం సిద్ధమైనట్లుగా క్లారిటీ వచ్చేసింది. మొదట్లో ఈనెల 25న విడుదల చేయాలనుకున్నప్పటికీ, 21న సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న హాలీవుడ్ సినిమా ‘అవతార్’ విడుదల కానుండటంతో, థియేటర్ల సమస్య ఏర్పడవచ్చు అనే ఉద్దేశంతో కాస్త ముందుగానే ఈనెల 12న విడుదల చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
Also read : ఛీ ఇలాంటి వారితో రాజకీయమా..? చంద్రబాబు సంచలనం
14 రీల్స్ నిన్న ఈరోస్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించాయి. నేడు మద్రాస్ కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. ఇదే అంశాన్ని కోర్టు ముందు ఉంచి సినిమా విడుదలకు అనుమతులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీనితో 11వ తేదీ నుంచి ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య.. ఓ ప్రముఖ తమిళ హీరో రాజీ చేసినట్లు సమాచారం. దీంతో సినిమా టికెట్ల ధరలకు సంబంధించి.. మరోసారి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నిర్మాణ సంస్థ కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే సినిమా ధరలు పెంచుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

