Sunday, March 22, 2026 10:25 AM
Sunday, March 22, 2026 10:25 AM

మళ్ళీ యాక్టివ్ అవుతోన్న అన్నలు..?

దండకారణ్యంలో మావోలు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారనే సంకేతాలు నిఘా వర్గాలను కలవరపెడుతున్నాయి. గత ఏడాది కాలంగా వరుస ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్ట్ లు ఇటీవల మళ్ళీ కొన్ని కార్యాకలాపాలకు శ్రీకారం చుడుతున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వీ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోలు చేస్తున్న కార్యక్రమాలపై నిఘా వర్గాలు.. దృష్టి సారించాయి. ఈ క్రమంలో మావోలు మళ్ళీ రిక్రూట్మెంట్ మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గిరిజన గ్రామాలపై మావోలు గురిపెట్టినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.

Also Read : పట్టు వీడని మావోలు.. ఎందుకంత ధైర్యం..?

ఆదివాసి గిరిజనుల్లో హిడ్మా సహా ఇతర మావోయిస్ట్ నాయకులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. దీనితో నేరుగా ఆ నాయకులే మళ్ళీ గ్రామాల్లో తిరుగుతూ ఉద్యమంలోకి యువతను ఆహ్వానిస్తున్నట్టు గుర్తించారు. అటు మావోల చర్యలపై కూడా పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు పోలీసులు మరణించడం, అన్నలు గట్టి పోరాటం చేయడంతో బలగాలు కూడా కంగుతిన్నాయి. ఇదే సమయంలో.. ఇన్ఫార్మర్ల మీద కూడా మావోలు దృష్టి సారించారు.

Also Read : అడ్డంగా దొరికిపోయిన జోగి బ్రదర్స్

తాజాగా హిడ్మా ఎన్కౌంటర్ పై లేఖ రిలీజ్ చేసిన మావోయిస్ట్ లు.. కొందరు వ్యాపారులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే.. ఓ కాంట్రాక్టర్ ను పట్టుకుంది తుది ముట్టించారు. అతని ద్వారా తమ సమాచారం బలగాలకు చేరుతుందని గుర్తించిన మావోలు.. కిడ్నాప్ చేసి, ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కొందరు జర్నలిస్ట్ లపై కూడా మావోలు దృష్టి పెట్టారు. తమ వీడియోల ద్వారా పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారని గుర్తించిన మావోలు.. వారికి కూడా హెచ్చరికలు పంపినట్టు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్