Sunday, September 20, 2026 04:08 AM
Sunday, September 20, 2026 04:08 AM

పట్టు వీడని మావోలు.. ఎందుకంత ధైర్యం..?

ఏడాది కాలంగా మావోయిస్ట్ పార్టీ కోలుకోలేని దెబ్బలు తింటోంది. గతంలో ఎందరో అగ్ర నాయకులు మరణించినా.. పార్టీని కాపాడుకుంటూ వచ్చిన మావోయిస్ట్ లు ఇప్పుడు అంతిమదశలో ఉన్నారు. ఎవరు కోవర్టో.. ఎవరు అరెస్ట్ అవుతారో.. ఎవరు ఎన్కౌంటర్ లో బలి అవుతారో అర్ధం కాక సతమవుతున్న మావోలు.. ధైర్యాన్ని మాత్రం వీడటం లేదు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితులు మావోయిస్ట్ పార్టీలో రోజు రోజుకు ఆందోళన కలిగిస్తోంటే.. మావోలు మాత్రం విప్లవాన్ని వీడేది లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు.

Also Read : అఖండ 2 ప్రీమియర్స్ రద్దు : కారణం అదేనా..?

తాజాగా మావోల నుంచి ఓ లేఖ వచ్చింది. ఆ లేఖలో ఉన్న అంశాలు చూసి.. మావోలకు అంత ధైర్యం ఏంటీ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సెంట్రల్ కమిటీ మెంబర్ లు, దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్ లు ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నా సరే.. తుపాకి వీడేది లేదంటూ ప్రకటించారు. హిడ్మా, టెక్ శంకర్ మరణాలు భూటకం అంటూ ప్రకటించారు. కేంద్రం మైండ్ గేమ్ ఆడుతోందని, తమ అగ్ర నేతలను కావాలనే బద్నాం చేస్తోందని వికల్ప్ పేరుతో ఓ లేఖను మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది.

Also Read : టీటీడీని వేధిస్తున్న మరో సమస్య..!

కలప వ్యాపారిని నమ్మి హిడ్మా ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాము గతంలో మాదిరిగా లేఖలు విడుదల చేయడం లేదని, ప్రజలు ఆవేదన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా పేర్కొంది. మరణించిన నాయకుల స్ఫూర్తితో పోరాటం చేస్తామని తెలిపింది. వారి త్యాగాలు వృధా కానీయం అంటూ ప్రకటించింది. దీనితో అటు పోలీసు వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. మావోల ధైర్యం ఏంటీ అనే ప్రశ్నలు పోలీసు ఉన్నతాధికారుల్లో సైతం వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్