Wednesday, August 5, 2026 01:51 PM
Wednesday, August 5, 2026 01:51 PM

రోకో లక్కీ గ్రౌండ్.. ఫ్యాన్స్ కు పండుగే

భారత్ – వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగనున్న మూడో వన్డే ఇప్పుడు ఉత్కంట రేపుతోంది. టెస్ట్ సీరీస్ గెలిచి ఊపు మీదున్న ప్రోటీస్ జట్టు ఇప్పుడు మూడో వన్డేలో గెలిచి ఈ టోర్నీ కూడా కైవసం చేసుకోవాలి పట్టుదలగా ఉంది. ఇక మ్యాచ్ జరగనున్న వైజాగ్ స్టేడియం భారత్ కు మోస్ట్ లక్కీ గ్రౌండ్ గా చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ ఓపెన్ అయిన దగ్గరి నుంచి ఆఖరి మ్యాచ్ వరకు కూడా భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఫార్మాట్ ఏదైనా సరే భారత్ ఇక్కడ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

Also Read : జగన్ మాస్టర్ ప్లాన్.. మామూలుగా లేదుగా..!

ఈ గ్రౌండ్ లో భారత్ పది వన్డేలు ఆడితే 7 గెలవగా.. రెండు ఓడిపోయింది. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. భారత్ నమోదు చేసిన అత్యధిక స్కోరు 387/5 గా ఉంది. వెస్టిండీస్‌తో 2019లో ఈ స్కోర్ నమోదు చేసింది. విరాట్ కోహ్లీ ఇక్కడ 587 పరుగులు చేసి.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ స్టేడియం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏప్రిల్‌ 5, 2005లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్ నిర్వహించగా.. ఆ మ్యాచ్ లో ధోనీ తన వన్డే కెరీర్ లో తొలి సెంచరీ చేసాడు.

Also Read : డాలర్ విలువ పెరిగితే.. మనపై ప్రభావం ఎలా పడుతుందో తెలుసా..?

చివరిగా మార్చి 19, 2023న భారత్‌-ఆస్ర్టేలియా మధ్య మ్యాచ్‌ నిర్వహించగా.. రెండేళ్ళ తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. 2010 నుంచి 2023 వరకు ఇక్కడ ఏడు వన్డేలు ఆడాడు. అందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేసాడు. 157 పరుగులు ఇక్కడ కోహ్లీ అత్యధిక స్కోర్. ఇక రోహిత్ శర్మ కూడా ఈ గ్రౌండ్ లో సత్తా చాటాడు. డిసెంబరు 18, 2019న వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో రోహిత్ 159 పరుగులు చేసాడు. 2011 నుంచి 2023 వరకు ఏడు మ్యాచ్‌ లు ఆడిన రోహిత్.. ఏడు ఇన్నింగ్స్‌ లలో 355 పరుగులు చేసాడు. కెఎల్ రాహుల్ పేరిట కూడా ఇక్కడ ఓ సెంచరీ ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

పోల్స్