Sunday, September 20, 2026 04:56 AM
Sunday, September 20, 2026 04:56 AM

డాలర్ విలువ పెరిగితే.. మనపై ప్రభావం ఎలా పడుతుందో తెలుసా..?

రూపాయి విలువ పడిపోయింది.. డాలర్ మారకం విలువ 90 రూపాయిలకు చేరుకుంది అంటూ మనం పదే పదే వార్తల్లో చూస్తూనే ఉంటాం. అసలు దాని కారణంగా ప్రభావాలు ఏంటీ.. అంతర్జాతీయ స్థాయిలో పడిపోయే మారకం విలువ.. గ్రామ స్థాయిలో ఉండే కామన్ మ్యాన్ పై ఎలా ప్రభావం, పడుతుందో చాలా మందికి తెలియదు. మేక్ ఇన్ ఇండియా ఈ సమయంలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో కూడా తెలియదు. అసలు డాలర్ మారకం విలువ ఏయే అంశాలపై ప్రభావం చూపుతుందో చూద్దాం.

Also Read : విమానయాన శాఖలో లోపం ఎవరిది?

విదేశాలలో అంటే అమెరికాలో చదివే విద్యార్ధులపై దీని ప్రభావం ఎక్కువ. ట్యూషన్ ఫీజులు పంపే వారికి ఇది ప్రధాన సమస్య అవుతుంది. అలాగే రోజు వారీ ఖర్చులకు డబ్బులు పంపే వారిపై కూడా దీనిపై ప్రభావం ఎక్కువ. విదేశీ పర్యటనకు వెళ్తే సైతం దీని ప్రభావం ఉంటుంది. బట్టలు, పాదరక్షలు, ఆభరణాలు, పెర్ఫ్యూమ్ లేదా వైన్ వంటి దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేస్తే వాటికి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఇది కలిసి వచ్చే అంశం. సాఫ్ట్ వేర్ ఎగుమతులకు వచ్చే డబ్బులు ఎక్కువగా ఉంటాయి.

ఎగుమతులు చేసే వారికి.. అంటే అమెరికాలో వాడే వస్త్రాలు వంటివి మన దేశం నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతాయి. వీటికి ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. డాలర్ విలువ పెరిగితే మేకిన్ ఇండియాకు సంబంధించిన చిన్న వ్యాపారులకు కలిసి వస్తుంది. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి కాబట్టి స్వదేశంలో తయారు చేసే వస్తువులకు.. డిమాండ్ పెరుగుతుంది.

Also Read : జగన్ గుండెల్లో అమరావతి రైళ్లు.. షాక్ ఇవ్వనున్న కేంద్రం..!

ఇంధన దిగుమతుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భారత్ దాదాపు 85% ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నందున, సామాన్యులు ఇంధనానికి మాత్రమే కాకుండా, రవాణా వంటి వాటికి ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. దీనితో ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో దిగుమతి చేసుకునే రంగాల్లో.. పని చేసే వారిని కూడా తొలగిస్తూ ఉంటారు. వారి జీతంలో కోత, ప్రోత్సాహకాలు తగ్గడం వంటివి ఉంటాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్