Wednesday, February 4, 2026 07:25 PM
Wednesday, February 4, 2026 07:25 PM

జగన్‌కు హిందూ సంఘాల వార్నింగ్..!

శ్రీవారి హుండీ అంటే.. అది భక్తుల అపారమైన విశ్వాసానికి, కృతజ్ఞతకు, సంపదకు, కోరికలను తీర్చే శక్తికి ప్రతీక. ఇది కేవలం డబ్బు పెట్టే పాత్ర కాదు, దైవానికి తమ మొక్కులు తీర్చుకోవడానికి, ధర్మం చేయడానికి భక్తులు సమర్పించే పవిత్రమైన కానుకలను స్వీకరించే శ్రీవారి కొప్పెర లేదా పవిత్ర పాత్ర. దీని ద్వారా తిరుమల ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలాల్లో ఒకటిగా నిలిచింది. అది స్వామివారి సంపదకు, మహిమకు నిదర్శనమని భక్తుల నమ్మకం. భక్తులు తమ కష్టాలు తీరాలని, కోరికలు నెరవేరాలని స్వామివారికి మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీర్చుకోవడానికి నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను హుండీలో వేస్తారు. శ్రీ చక్ర స్థాపన వల్ల, కుబేరుడి నుంచి స్వామివారు పొందిన సంపద వల్ల, స్వామివారి మహిమ వల్ల హుండీ నిత్యం కళకళలాడుతుందని భక్తుల నమ్మకం.

Also Read : టీటీడీని వేధిస్తున్న మరో సమస్య..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం స్వామిని దర్శించుకునే భక్తులు స్వామి వారికి ముక్కులు చెల్లిస్తారు. ఆనంద నిలయంలోనే స్వామి వారి సమీపంలోనే ఈ హుండీ ఏర్పాటు చేశారు. నగదు, బంగారం, వస్తు రూపంలో కూడా ముడుపులు కట్టి హుండీలో స్వామి వారికి భక్తితో సమర్పిస్తారు. అలాంటి శ్రీవారి హుండీ పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. శ్రీవారి హుండీని, భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా జగన్ వ్యాఖ్యానించారంటూ ఇప్పుడు హిందూ ధార్మక సంఘాలతో పాటు టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పరకామణి చోరీ కేసులో కుట్ర కోణం దాగుందని.. దీని వెనుక నాటి వైసీపీ పెద్దలున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పరకామణి చోరీ కేసులో ఇప్పటికే టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు నాటి ఈవో ధర్మారెడ్డిని కూడా సీఐడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఫిర్యాదు దారు సీఐ సతీష్ కుమార్ హత్య మరింత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

Also Read : అల్లు అర్జున్ అలా చేశారన్న దిల్ రాజు..!

శ్రీవారి హుండీ అంటే అంత లోకువా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీసారు. అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించడని గుర్తుంచుకోవాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని.. పరకామణి చోరీ కేసు విషయంలో అహకారంతో మాట్లాడిన తీరును హిందూ సమాజం క్షమించదన్నారు. పవిత్రమైన శ్రీవారి హుండిలో చేయి పెట్టినా తప్పు లేదన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారన్నారు. శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తారని.. కానీ శ్రీవారినే జగన్ నిలువు దోపిడీ చేసిన రకమన్నారు. సీఎంగా ఉన్నప్పుడు శ్రీవారి విషయంలో నువ్వు అనేక పాపాలు చేశారని.. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీవారి హుండి నుంచి రూపాయి తీసినా పాపమే… అలాంటింది పరకామణి చోరీ… ఏదో చిన్న చోరీ అంటావా..? అని నిలదీశారు. శ్రీవారి హుండి విషయంలో జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్