Sunday, September 20, 2026 05:43 AM
Sunday, September 20, 2026 05:43 AM

అఖండ తాండవం వచ్చే ఏడాదేనా..? ఈ అప్డేట్ చూసారా..?

అఖండ తాండవం కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఊహించని దెబ్బ తగిలింది. అఖండ మాదిరిగా డిసెంబర్ లోనే థియేటర్ లో రిలీజ్ అవుద్దనుకున్న అఖండ సీక్వెల్ ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ తో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అందుబాటులో ఉన్న యాప్స్ లో టికెట్ బుక్ చేసుకున్నవాళ్ళు, థియేటర్ల వద్ద ఎదురు చూసి టికెట్ లు కొన్న వాళ్ళందరి ఆశలపై నిర్మాతలు నీళ్ళు చల్లారు. కారణం ఏదో తెలియక అభిమానులు కన్నీళ్లు కూడా పెట్టుకున్న పరిస్థితి.

Also Read : విమానయాన శాఖలో లోపం ఎవరిది?

ఆ పరమ శివుడి ఆశీస్సులతో సినిమా హిట్ అవ్వాలనుకున్న ఫ్యాన్స్.. ఆ శివయ్య ఆశీస్సులతో త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. ఎవరు ఆపారో అర్ధం కాక.. అందరినీ తిడుతున్న ఫ్యాన్స్.. సినిమా ఎప్పుడా అని.. ఆన్లైన్ లో జల్లెడ పట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ టైం లో బాలయ్య ఫ్యాన్స్ కు.. ఆలస్యంగా చేదు వార్త చెప్పింది ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్.. బుక్ మై షో. ఈ సినిమా మరో రెండు రోజుల్లో.. మరో వారం రోజుల్లో.. మరో పది రోజుల్లో అనుకున్న వాళ్ళ ఆశలపై నీళ్ళు చల్లేసింది.

Also Read : చంద్రబాబు ఎందుకు ఈజీ టార్గెట్ అవుతున్నారు?

వచ్చే ఏడాదే ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసింది. 2026 లో రిలీజ్ కాబోయే సినిమాల జాబితాలో అఖండ సీక్వెల్ ను కూడా చేర్చింది బుక్ మై షో. అంటే సంక్రాంతికి విడుదల కావొచ్చు.. సంక్రాంతి తర్వాత కావొచ్చు.. విశ్వంభర, రాజా సాబ్ మాదిరిగా ఓ స్పష్టత కూడా లేకపోవచ్చు. ఏది ఎలా ఉన్నా.. ట్రైలర్ లు, టీజర్ లు, గ్లింప్స్ ఇలా వచ్చిన ప్రతీ అప్డేట్ క్రేజీగా ఫీల్ అయిన బాలయ్య ఫ్యాన్స్ కు.. సినిమా నిర్మాతలు కొట్టిన దెబ్బ మాత్రం అదిరిపోయే క్రేజీనే. చూద్దాం ఎప్పుడు అవుతుందో మరి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్