Sunday, September 20, 2026 01:47 AM
Sunday, September 20, 2026 01:47 AM

బనకచర్ల పై కేంద్రం సంచలన ప్రకటన..!

గత ఏడాది కాలంగా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తీవ్ర రాజకీయ దుమారం నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. అటు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి కూడా చూశాం. చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మాత్రం వెనక తగ్గడం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. తాజాగా దీనికి సంబంధించి పార్లమెంట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : ప్రాంతీయ విద్వేషాలు.. ఎవరికి లాభం..?

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంట్లో బనకచర్ల ప్రాజెక్ట్ గురించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు ప్రశ్న వేశారు. దీనికి కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తమకు అందిందని ప్రకటించింది కేంద్రం. రిపోర్టును ఏపీ ప్రభుత్వం సమర్పించినట్లు పేర్కొంది. ప్రాజెక్టు అంచనా వ్యయం 81 వేల 900 కోట్లుగా పేర్కొంది. ఈ రిపోర్టును కృష్ణ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు పంపించామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, మధ్యప్రదేశ్, చతిస్గడ్ రాష్ట్రాలకు పంపినట్లు తెలిపింది.

Also Read : గుడ్ న్యూస్: ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పనిలేదు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన అంచనాలు 30 వేల 436 కోట్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం లో పేర్కొంది. ఇప్పటివరకు 20 వేల 658 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ కు అందించినట్లు కేంద్ర జల శక్తి శాఖామంత్రి సి ఆర్ పాటిల్ వెల్లడించారు. ఇక కేంద్రం ప్రకటనతో బనకచర్ల ప్రాజెక్టు ఉనికిలోనే ఉంది అనే విషయం స్పష్టత వచ్చింది. దీనిపై వైసీపీ చేస్తున్న విమర్శలకు కూడా ఓ రకంగా సమాధానం వచ్చినట్లుగానే చూడవచ్చు అంటున్నారు పరిశీలకులు. అలాగే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గలేదనే అంశం కూడా క్లారిటీ వచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్