Wednesday, August 5, 2026 03:56 PM
Wednesday, August 5, 2026 03:56 PM

గుడ్ న్యూస్: ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పనిలేదు

రవాణా వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక మార్పులు తీసుకొస్తుంది. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. అలాగే అక్రమాలకు ముగింపు పలికేందుకు కూడా ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. ముఖ్యంగా టోల్ ఫీజులకు సంబంధించి ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.

Also Read : బాలు విగ్రహం చుట్టూ రాజకీయం..!

దీనితో టోల్ ఫీజు ల వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. ఫాస్టాగ్ వ్యవస్థలో కూడా క్రమంగా కొత్త నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. మరో కీలక నిర్ణయం అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొత్త టోల్ వ్యవస్థ గురించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ ద్వారా టోల్ ఫీజులను వసూలు చేస్తామని ప్రకటించారు గడ్కరీ.

Also Read : కోటలు దాటుతున్న అన్న మాటలు..!

ఈ కొత్త వ్యవస్థ ద్వారా టోల్ గేట్లు వద్ద ఆగకుండానే ప్రయాణం చేయవచ్చని తెలిపారు కేంద్ర మంత్రి. ఇప్పటికే దేశంలో పది చోట్ల ఇటువంటి వ్యవస్థ అమలవుతుందని.. దీనిని దేశం మొత్తం తీసుకొస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో పూర్తిగా దేశం మొత్తం ఈ వ్యవస్థ అమలవుతుందని తెలిపారు. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ పెరిగిపోవడంతో అత్యవసర సేవలకు ఇబ్బంది కలుగుతుందని.. ఈ వ్యవస్థను తీసుకురావడం ద్వారా రవాణా వేగాన్ని మరింతగా పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక ఈ వ్యవస్థ వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో వాహనదారుల కష్టాలు జాతీయ రహదారులపై కొంత తీరినట్లే. సంక్రాంతి, దసరా సమయంలో తెలుగు రాష్ట్రాల్లో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్