భారత క్రికెట్ లో కొన్ని సన్నివేశాలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. యువకులకు అవకాశం కల్పించాలనే కారణంతో.. విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మను, రవిచంద్రన్ అశ్విన్ ను, మహమ్మద్ షమీ ను పక్కన పెట్టాలని క్రికెట్ విశ్లేషకులు కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ విషయంలో, రోహిత్ శర్మ విషయంలో వయసు గురించి మాట్లాడే చాలామంది క్రికెట్ లో ఓ ఆటగాడి గురించి మాత్రం కామెంట్ చేయరు. అతను ఎవరో కాదు.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఎంతోమంది యువ ఆటగాళ్లు జట్టులో చోటు కోసం నానా కష్టాలు పడుతున్నారు. అందుకే సీనియర్లను పక్కన పెట్టాలని గౌతమ్ గంభీర్ కూడా కష్టపడుతున్నాడు.
Also Read : కోహ్లీ పనితో షాక్ అయిన గంభీర్..!
మరి రవీంద్ర జడేజా విషయంలో ఎందుకు పక్కన పెట్టడం లేదనే ప్రశ్నలు వినపడుతున్నాయి. జడేజా బౌలింగ్ లో పస తగ్గిపోయింది. స్వదేశంలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. విదేశాల్లో బ్యాటింగ్ తో కొంత జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బ్యాట్స్మెన్ గా జట్టులోకి అడుగుపెట్టిన జడేజా.. ఆ తర్వాత పార్ట్ టైం బౌలర్ నుంచి ఫుల్ టైం బౌలర్ గా మారిపోయాడు. ఇప్పుడు మళ్లీ కెరీర్ చివర్లో బ్యాట్స్మెన్ గా మారిపోయి జట్టులో చోటు కోసం కష్టపడుతున్నాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండో వన్డేలో జడేజా ప్రదర్శన కారణంగానే జట్టు ఓటమిపాలైందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : గంభీర్ ఎక్కడ..? ఓ ఆట ఆడుకుంటున్న కోహ్లీ ఫ్యాన్స్
మొదటి వన్డేలో కూడా జడేజా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఓ వర్గం క్రికెట్ విశ్లేషకులు మాత్రం అతని గురించి ఎక్కడా కామెంట్ చేయడం లేదు. విరాట్ కోహ్లీకి అతనికి వయసులో నెల రోజులు మాత్రమే తేడా. కోహ్లీ వయసు గురించి రోహిత్ శర్మ వయసు గురించి కామెంట్ చేసే పెద్దలు జడేజా వయసు గురించి మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. వన్డేలకు అతను ఫిట్ కాకపోయినా సరే జట్టులో ఎంపిక చేశారు. ప్రతి మ్యాచ్ లో తుది జట్టులో అతను ఉంటున్నాడు. ఓవైపు వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆల్రౌండర్ ఉండగా.. జడేజా ఎందుకనే ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. టెస్ట్ క్రికెట్లో కూడా ఈ మధ్యకాలంలో అతను బ్యాటింగ్ లో మినహా బౌలింగ్లో ఆకట్టుకున్న సందర్భాలు లేవు. ఇతర సీనియర్ ఆటగాళ్ల విషయంలో చూపించిన చొరవ.. జడేజా విషయంలో ఎందుకు లేదనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

