Sunday, June 21, 2026 02:29 AM
Sunday, June 21, 2026 02:29 AM

సంచార్ సాథీ ఓ పెగాసస్..? కేంద్రంపై తీవ్ర విమర్శలు..!

సైబర్ సెక్యూరిటీతో పాటు వ్యక్తిగత భద్రత విషయంలో టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో కీలక అడుగులు వేస్తోన్న కేంద్రం.. తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్ లలో.. సంచార్ సాథీ యాప్‌ ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనుమానాస్పద కాల్‌ లు, మెసేజ్ లు, ఫ్రాడ్ మెసేజ్ లు, ఫ్రాడ్ కాల్స్ గురించి నేరుగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీ పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు.

Also Read : ఐబొమ్మకు సినిమాలు అమ్మిన నిర్మాతలు..?

దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ఈ యాప్ బ్లాక్ చేస్తుంది. మొబైల్ హ్యాండ్సెట్ ఐఎంఈఐ నెంబర్ ద్వారా నకిలీ లేదా మార్చిన ఫోన్ లను గుర్తిస్తారు. ఇందులో ఆడియో ఫిర్యాదులు కూడా చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది దీనిని పెగాసస్ స్పైవేర్‌తో పోలుస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌ లో ఉన్న ఫోన్‌ లలో కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా యాప్‌ ను ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం కంపెనీలను కోరింది.

Also Read : ఐపీఎస్ సునీల్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమా..!

ఇందుకోసం 90 రోజుల గడువు ఇచ్చింది కేంద్రం. ఈ యాప్ ను రిమూవ్ చేయడం లేదా, పర్మీషన్ లు ఆపడం సాధ్యం కాదు. గతంలో పెగాసస్ స్పై వేర్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. టార్గెట్ చేసిన ఫోన్ లో ఉన్న డేటా తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ వాడుతున్నట్టు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బహిరంగంగా ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయాలనే ఆదేశాలు ఇవ్వడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ యాప్ చాలా డేటా యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఫోటోలు, డేటా, మెసేజ్ లు, ఇతర యాప్ ల వాడకం సహా అనేక విషయాలపై నిఘా పెడుతుంది. దీనితో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దీనిని పెగాసస్ తో పోల్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్