Sunday, June 21, 2026 02:18 PM
Sunday, June 21, 2026 02:18 PM

కర్నూలు టీడీపీపై ఆందోళనలో అధిష్టానం.. సంచలన నివేదికలతో కలవరం..!

గత కొన్నాళ్ళుగా టీడీపీ నేతల వ్యవహారశైలిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యవహారాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న నేతలపై అధినేత, సిఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా కర్నూలు జిల్లా టీడీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న కార్యకర్తలను పట్టించుకోని నేతల తీరును తప్పుబట్టారు.

Also Read : నెల్లూరు వైసీపీకి ఊహించని షాక్..!

కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఆర్ధిక వనరులపై దృష్టి పెట్టారు సిఎం. నియోజకవర్గలలో ఇసుక, లిక్కర్, గ్రావెల్, భూదందాలలో జోక్యం చేసుకుంటున్న ఎమ్మెల్యేలపై నివేదికలు కోరినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో స్వయంగా చంద్రబాబు ఆరా తీసారు. క్షేత్ర స్థాయిలో కూటమి నేతల మధ్య విబేధాలు ఉన్నట్టు కూడా చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. కూటమిలో నాయకుల మధ్య సమన్వయం లేకుంటే జగన్ బలపడే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు.

Also Read : జగన్, కేటీఆర్ కలయిక.. వారికి పండగే..!

కార్యకర్తలను, నాయకులను గాలికి వదిలేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి అనుచరులపై వరుసగా వివాదాలు ఉండటం.. ఆళ్లగడ్డలో జనసేన వర్సెస్ టీడీపీగా రాజకీయాలు నడవడంపై చంద్రబాబు అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మిగనూరు బీజేపీలో కీలకంగా ఉన్న నేతలు వైసీపీలో చేరడం సంచలనం అయింది. కర్నూల్ జిల్లాలో వైసీపీ బలపడుతుంది అంటూ క్షేత్ర స్థాయి నుంచి సీఎం చంద్రబాబుకు నివేదికలు అందినట్టు తెలుస్తోంది. దీనితో జిల్లా నేతలతో స్వయంగా తానే సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్