Sunday, March 22, 2026 10:14 AM
Sunday, March 22, 2026 10:14 AM

అవసరం వస్తే.. తిరిగి వస్తా..!

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ పై తేల్చేశారు. సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తారంటూ కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ సన్నిహిత నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత కొద్ది రోజుల పాటు జగన్‌కు దూరంగా ఉన్న సాయిరెడ్డి.. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అదే సమయంలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు పార్టీ వీడే సమయంలో ప్రకటించారు. అదే సమయంలో వైసీపీలో కోటరీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. తనకు జగన్ అంటే అభిమానమని చెబుతూనే.. ఇక తన జీవితం వ్యవసాయానికి అంకితం అని ప్రకటించారు.

Also Read : బ్రేకింగ్: ఫార్ములా మొత్తం కేటిఆర్ దే.. ఏసీబీ సంచలనం..!

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి విశాఖ వేదికగా రాజకీయాలు చేశారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించిన సాయిరెడ్డి.. కాకినాడ పోర్టు లావాదేవీలతో పాటు లిక్కర్ మాఫియాలో కూడా కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ రెండు కేసుల్లో సాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. కాకినాడ పోర్టులో వాటాలను బలవంతంగా లాక్కున్నారనేది సాయిరెడ్డి పైన ఆరోపణ. ఈ రెండు కేసుల్లో విచారణకు హాజరైన సాయిరెడ్డి.. ఓపెన్‌గా తన అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిపారు. రాజకీయాలకు గుడ్ బై అని చెప్పిన సాయిరెడ్డి.. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గానే ఉన్నారు. రాజకీయ పార్టీలపైన, ప్రభుత్వంపైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. నేనున్నా అనే మాటను గుర్తు చేస్తున్నారు.

తాజాగా విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజకీయాల్లోకి తన రీ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్ట ఆలోచన తనకు ఎట్టి పరిస్థితుల్లో లేదన్నారు సాయిరెడ్డి. అదే సమయంలో పవన్‌తో తన అనుబంధం గురించి సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పవన్‌తో తనకు దాదాపు 20 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. తాను ఎప్పుడు పవన్ కల్యాణ్‌ను విమర్శించలేదన్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబుతో తనకు కేవం రాజకీయ వైరం తప్ప.. వ్యక్తిగత విరోద్ధం లేదన్నారు. నాడు వైసీపీలో ఉన్న కారణంగా నాటి పార్టీ నియమానుసారమే తాను అలా వ్యాఖ్యానించినట్లు తెలిపారు.

Also Read : రాశీ ఖన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్.. అభిమానితో డేటింగ్ కి రెడీనా?

వైఎస్ కుటుంబంతో సాయిరెడ్డికి దాదాపు 30 ఏళ్లుగా అనుబంధం ఉంది. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జగన్‌కు అన్ని విధాలుగా సహకరించారనేది సాయిరెడ్డి మీద ప్రధాన ఆరోపణ. ఆడిటర్ కూడా అయిన సాయిరెడ్డి.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్నారు. ప్రతి వారం కోర్టు వాయిదాలకు హాజరయ్యారు కూడా. ఆ సాన్నిహిత్యంతోనే 2019 -2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. జగన్ తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఢిల్లీ పెద్దలకు అనుసంధానకర్తగా కూడా సాయిరెడ్డి వ్యవహరించారు. ఒక దశలో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీకి సాయిరెడ్డి ఆసక్తి చూపించారు కూడా. కానీ జగన్ మాత్రం విశాఖకు బదులుగా నెల్లూరు నుంచి బరిలో దింపారు. దీంతో అయిష్టంగానే ఎన్నికల్లో పోటీ చేసిన సాయిరెడ్డి.. ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత జగన్‌కు, వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.

మరోసారి వైసీపీలోకి వస్తారంటూ సాయిరెడ్డిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. దానిపై సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అవసరం వచ్చినప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తానంటూ తన ఆలోచన ఏంటో తేల్చేసారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగా వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. తాను వ్యవసాయం చేసుకుంటున్నానని.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు మరోసారి స్పష్టం చేసారు. జగన్‌కు చెప్పేది ఒక్కటే.. అప్పుడైనా, ఇప్పుడైనా ఆయన చుట్టూ నిబద్ధతలేని వ్యక్తులున్నారని… వారి మాటలను జగన్‌ నమ్మకూడదని చెప్పిన సాయిరెడ్డి… చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్