Wednesday, May 6, 2026 10:30 PM
Wednesday, May 6, 2026 10:30 PM

బ్రేకింగ్: ఫార్ములా మొత్తం కేటిఆర్ దే.. ఏసీబీ సంచలనం..!

తెలంగాణా రాజకీయాల్లో అత్యంత సంచలనం రేపిన ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా..? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. ఈ కేసులో తాజాగా కేటిఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపధ్యంలో.. కేటిఆర్ ను విచారించేందుకు అధికారులు రంగం సిద్దం చేసారు. అటు ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్న నేపధ్యంలో విచారణ మరింత వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read : బ్రేకింగ్: ఎలక్షన్ కమీషన్ సంచలన నిర్ణయం..!

తాజాగా ఏసీబీ అధికారులు సిద్దం చేసి, ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక అత్యంత సంచలనంగా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న తొలి నివేదికను ఏసీబీ అధికారులు నివేదిక అందించారు. 2024 డిసెంబర్‌ 19న నమోదైన ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ కేసుపై నివేదిక సిద్దం చేసి, ప్రభుత్వానికి సమర్పించారు. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2 గా ఐఏఎస్ అరవింద్‌ కుమార్‌, ఏ3 గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ4, ఏ5 గా ఎఫ్ఈఓ ప్రతినిధులను ఏసీబీ అధికారులు చేర్చారు. ఫార్ముల్ ఈ-రేస్‌ నిర్వహించాలన్నది కేటీఆర్‌ సొంత నిర్ణయం అని నివేదికలో స్పష్టం చేసింది.

Also Read : అక్రమ కేసులు, అక్రమాస్తుల కేసులు ఒక్కటి కాదు

ఇందులో ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్‌ నిర్వహించారని, క్విడ్‌ ప్రో కో జరిగిందని తమ నివేదికలో వెల్లడించింది. బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు అందాయని పేర్కొంది. ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే బీఆర్ఎస్ కి ఈ-బాండ్లు చెల్లించారని వెల్లడించింది. అలాగే గవర్నర్‌ సంతకం లేకుండానే అగ్రిమెంట్లకు ఐఏఎస్‌ అరవింద్‌ అనుమతులు ఇచ్చారని తెలిపింది. 2 అగ్రిమెంట్లు కూడా గవర్నర్‌ నోటీసులో లేవని, ఎంఏయూడీ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని, సీఎం, సీఎస్‌, ఆర్థిక మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని వివరించింది. చెల్లింపులు, అగ్రిమెంట్లు చేసి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని వివరించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్