Sunday, September 20, 2026 12:07 AM
Sunday, September 20, 2026 12:07 AM

బ్రేకింగ్: ఎలక్షన్ కమీషన్ సంచలన నిర్ణయం..!

ఈవీఎంల విషయంలో దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తోన్న నేపధ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తోంది. తాజాగా వోటింగ్ మెషిన్ లకు సంబంధించి కొత్త రూల్స్ ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపధ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు ప్రారంభించింది. త్వరలోనే ఈవీఎంలను టెస్ట్ చేసే కార్యక్రమం, ఓటింగ్ రిహార్సల్స్ ప్రారంభించనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో, ఏ విధమైన సమాచారం ఉండాలనే దానిపై కొత్త కసరత్తు మొదలుపెట్టింది.

Also Read : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

ఈసారి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి అభ్యర్థి ఫోటో కూడా అక్కడ ముద్రించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి చిత్రాన్ని ఈవీఎంలపై చేర్చడం ఇదే మొదటిసారి. ఈసీ అధికారుల వివరణ ప్రకారం.. ఈవీఎంలో ఓటు వేసే బటన్ పక్కన.. అభ్యర్ధి ఫోటో ఉంచుతారు. ఎన్నికల కమీషన్ ప్రకారం.. 2026 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,000 పోలింగ్ బూత్‌ లు పెరిగే అవకాశం ఉంది. 2021 ఎన్నికలలో, రాష్ట్రంలో 80,681 బూత్‌ లు ఉన్నాయి. 2026లో ఈ సంఖ్య దాదాపు 95,000కి పెరుగుతుంది.

Also Read : అమరావతి నిర్మాణ కూలీలలో మావోలు..?

పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ ప్రతి బూత్‌ కు సరిపడా ఈవీఎంలు ఉండే విధంగా చూసేందుకు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ప్రస్తుతం 1.30 లక్షల ఈవీఎంలు.. బ్యాలెట్లు, కంట్రోల్ యూనిట్లు, రిజర్వ్‌ లతో సహా, 1.35 లక్షల వీవీ ప్యాట్ యంత్రాలను సిద్దం చేసారు. ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి ఎన్నికల కమీషన్ సభ్యులు.. కసరత్తు నిర్వహిస్తారు. అధికారుల వివరణ ప్రకారం, ఈవీఎంలో మొత్తం 6 ఓటింగ్ బటన్లు ఉంటాయి, ప్రతి బటన్‌ ను 16 సార్లు, మొత్తం 96 సార్లు రిహార్సల్ ఓటింగ్ ద్వారా టెస్ట్ చేస్తారు. కలకత్తాలోని న్యూటౌన్‌ లో ఎకో పార్క్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్ లో బెంగళూరులోని ఈవీఎం తయారీ సంస్థ ఈసీఐఎల్ ఇంజనీర్ల నుండి అధికారులు శిక్షణ తీసుకుంటారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్