Sunday, September 20, 2026 12:07 AM
Sunday, September 20, 2026 12:07 AM

ఉద్యమాన్ని ఆపేది లేదు.. మావోల సంచలన లేఖ

ఓ వైపు వరుస ఇబ్బందులు పడుతోన్న మావోయిస్ట్ పార్టీ.. ఎంత మంది ప్రాణాలు పోయినా సరే ఉద్యమాన్ని వీడేది లేదని స్పష్టం చేసింది. మావోయిస్ట్ పార్టీ అగ్ర నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వీ హిడ్మా మరణంపై.. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఓ లేఖను విడుదల చేసింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మాడ్వీ హిడ్మాతో పాటుగా, రాజే సహా మరికొందరిని విజయవాడలో నవంబర్ 15న పట్టుకుని, నిరాయుధులను చేసి.. వారిని పట్టుకుని మారేడుమిల్లి ఎన్కౌంటర్ కథ అల్లారని ఆరోపించింది.

Also Read : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ ను పట్టుకుని, హత్యా చేసి రంప చోడవరం ప్రాంతంలో ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని మండిపడింది. అందుకు గానూ నవంబర్ 23 న దేశ వ్యాప్త నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చింది. ఫాసిస్ట్ ప్రభుత్వం కార్పోరేట్ ల ప్రయోజనాల కోసమే ఈ హత్యలు చేస్తోందని మండిపడింది. చికిత్స కోసం విజయవాడ వెళ్ళిన హిడ్మాను దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనలలో ప్రాణాలు కోల్పోయిన కామ్రేడ్ లకు మావోయిస్ట్ పార్టీ నివాళి అర్పిస్తోందని తెలిపింది.

Also Read : సిఎం మార్పు ఖాయమే..? వదలని డిప్యూటి సిఎం..!

హిడ్మా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు అని, అతనిని మీడియా, ఓ వర్గం మేధావులు ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య చేసిన తర్వాత మరింత తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. కార్పోరేట్ లకు దేశ సంపదను దోచి పెడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా మావోయిస్ట్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దేశంలో ప్రతిపక్ష పార్టీలను మొత్తాన్ని నిర్మూలించి బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను సైతం ధ్వంశం చేసే పథకాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతాంగానికి, యువతకు, విద్యార్ధులకు, సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నామని పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్