టీమిండియా కెప్టెన్ గా మళ్ళీ రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత.. వన్డే కెప్టెన్సీ బాధ్యతలు నుంచి కూడా బోర్డు పక్కన పెట్టింది. ఆ తర్వాత కెప్టెన్ గా యువ ఆటగాడు శుభమన్ గిల్ ను ఎంపిక చేశారు. ఈ ఏడాది జరిగిన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్.. ఆ తర్వాత భారత్ లో జరిగిన వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ లకు అతన్నీ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇక ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన భారత జట్టుకు.. వన్డే కెప్టెన్ గా అతనిని తొలిసారి ఎంపిక చేశారు.
Also Read : మన్యంలో తుపాకీ మోత.. అగ్రనేత హిడ్మా హతం..!
అయితే సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి టెస్ట్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెడ కండరాలు పట్టేయడంతో.. గిల్ మైదానాన్ని వీడే పరిస్థితి వచ్చింది. దీనితో రెండో టెస్ట్ విషయంలో క్లారిటీ రాలేని పరిస్థితి. అతనినీ ఈ సిరీస్ కు పక్కన పెట్టే అవకాశం ఉండవచ్చని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న వన్డే సీరిస్ విషయంలో ఎవరిని కెప్టెన్ గా ఎంపిక చేస్తారనేది క్లారిటీ రాలేదు. అతను అప్పటికి కోలుకునే అవకాశాలు తక్కువేననే వార్తలు సైతం వస్తున్నాయి.
Also Read : గోవా టూరిజం పడిపోయిందా..? లెక్కలు ఏం చెప్తున్నాయి..?
దీనితో మళ్లీ వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగానే ఉందని.. 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ కు అతను కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. వచ్చేవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అప్పటికి గిల్ ఫిట్ గా లేకపోతే మాత్రం రోహిత్ బాధ్యతలు మరోసారి చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గిల్ విషయంలో టీమిండియా యాజమాన్యం కూడా క్లారిటీ ఇవ్వలేకపోతోంది. ఇక కెప్టెన్ గా కూడా అతను ఫెయిల్ అవుతున్నాడు అనే విమర్శలు సైతం వచ్చాయి. అగ్ర జట్లపై ఆడలేక పోతున్నాడు అనే విమర్శలు ఉన్నాయి. దీనితో గిల్ విషయంలో సెలెక్షన్ కమిటీ ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి. ఇక రెండో టెస్ట్ కు కేఎల్ రాహుల్, లేదా వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్.. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

