Thursday, May 7, 2026 09:20 AM
Thursday, May 7, 2026 09:20 AM

మాజీ మంత్రిపై మరో కేసు..!

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను బెదిరించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదు మేరకు అంబటి పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి.. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని.. భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించారని చర్యలకు సిద్ధం అయ్యారు పోలీసులు. అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయ్యింది.

Also Read : విశాఖలో ఐటి కంపెనీల జాతర

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ నిర్వహించాయి. అయితే ఆ ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే పరిమిత సంఖ్యలో నిర్వహించుకోవాలని పోలీసులు అనుమతిచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ర్యాలీ నిర్వహించుకోవాలని అనుమతి కోరిన వారికి పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముందుగానే పోలీసులు హెచ్చరించారు.

కానీ అంబటి రాంబాబు మాత్రం.. గుంటూరులో ఎలాంటి అనుమతి లేకుండానే ర్యాలీ నిర్వహించారు. భారీ ఎత్తున వైసీపీ శ్రేణులతో రహదారిపై ర్యాలీ చేపట్టారు. దీని వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పినా సరే అంబటి రాంబాబు మాత్రం వినలేదు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పిన డీఎస్పీ అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు అంబటి. ర్యాలీ అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు అంబటి. అడ్డుకున్న పోలీసులను నెట్టేశారు.

Also Read : ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ ప్రవీణ్ ప్రకాష్.. షాక్ లో అధికార వర్గాలు

లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పిన డీఎస్పీతో మాకు తెలియదా.. మేమేమైనా చిన్న పిల్లలమా.. మీరు చెప్తే వినాలా.. మీ దగ్గర నేర్చుకోవాలా.. అంటూ వాదించారు. సీఐ వెంకటేశ్వర్లును తోసేసి.. అడ్డుకున్న కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా అంబటి ఇదే మాదిరిగా పోలీసులపై దౌర్జన్యం చేశారు. జగన్ సత్తెనపల్లి పర్యటనకు వచ్చే సమయంలో పోలీసులను బెదిరించారు అంబటి. దీంతో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పాటు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలపై కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో BNS 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించారని పోలీసులు తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్