Thursday, August 6, 2026 02:32 AM
Thursday, August 6, 2026 02:32 AM

ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. వామ్మో..!

ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి దారులకు నమ్మకం కలిగింది. గతంలో ఏపీలో పెట్టేందుకు వెనుకడుగు వేసిన కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు పాలనపై నమ్మకంతో మళ్లీ ఏపీ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖలో లక్షన్నర కోట్లు పెట్టుబడి పెడుతోంది. తాజాగా మరో బడా సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Also Read : వైసీపీలో కలకలం.. అప్రూవర్‌గా ధర్మారెడ్డి..!

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది చంద్రబాబు సారధ్యంలోని కూటమి సర్కారు. ఇందుకోసం విశాఖో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ మరో భారీ విజయం దక్కించుకుంది. ఈ మేరకు ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ కంపెనీ తిరిగి రాబోతోందని ఒకరోజు ముందే మంత్రి లోకేష్ చేసిన ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ, తుపానులా ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తోంది. పూర్తి వివరాల త్వరలో అంటూ ఒకరోజు ముందే లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

చెప్పినట్లుగానే తన సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది ‘రీన్యూ’ సంస్థ. ఈ సంస్థ రాష్ట్రంలో ఏకంగా 82 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన రీన్యూ సంస్థ.. తిరిగి ఏపీకి రావడం పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులకు ఏపీ సరైన ప్రదేశం అని లోకేష్ ప్రకటించారు. రీ న్యూ సంస్థ పెట్టుబడులపై లోకేష్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

Also Read : కాశ్మీర్ లో తెలుగోడి సత్తా.. ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న ఆఫీసర్..!

ఐదేళ్ల విరామం తర్వాత రీన్యూ సంస్థ ఏపీలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా పెట్టేందుకు ముందుకు రావడం గర్వంగా ఉందన్నారు మంత్రి లోకేష్. సోలార్ ఇంగాట్, వేపర్ తయారీ వంటి హై టెక్నాలజీ విభాగాల నుంచి గ్రీన్ హైడ్రోజన్, అణువుల ఉత్పత్తి వరకు అన్ని దశల్లో రీ న్యూ సంస్థ 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించినట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు రీ న్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా, ఆయన బృందానికి స్వాగతం పలుకుతోంది.. అంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.

82 వేల కోట్ల పెట్టుబడి ద్వారా దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలకంగా మారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. రీ న్యూ సంస్థ పెట్టుబడులతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్