Sunday, June 21, 2026 04:31 PM
Sunday, June 21, 2026 04:31 PM

వైవీ సుబ్బారెడ్డి అరెస్ట్..? ఆయన్ను కూడా..?

ఆంధ్రప్రదేశ్ లో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం, ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతుంది. సిబిఐ అధికారులు, రాష్ట్ర పోలీస్ అధికారులతో కలిపి ఏర్పాటు చేసిన సిట్ ఇప్పుడు కీలక వ్యక్తులను విచారిస్తోంది. కల్తీ నెయ్యికి సంబంధించి బోలె బాబా డెయిరీ గురించి కీలక విషయాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది. ఐదేళ్లపాటు 68 లక్షల కేజీల నెయ్యిని ఆ కంపెనీ సరఫరా చేసిందని సిట్ గుర్తించింది. కానీ బయట నుంచి వెన్న గాని, పాలు గాని ఆ కంపెనీ కొనుగోలు చేయలేదని తేల్చారు.

Also Read : బ్రేకింగ్: అయ్.. అన్నొస్తున్నాడోచ్..!

దీనితో ఒక్కసారిగా భక్తుల్లో కలవరం మొదలైంది. ఈ కేసుకు సంబంధించి టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పిఎ చిన్న అప్పన్నను అదుపులోకి తీసుకున్న తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత నుంచి కొంతమంది కీలక వ్యక్తులకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డిని నిన్న సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 9 గంటల వరకు దాదాపు పది గంటల సమయం ఆయనను సిట్ అధికారులు విచారించారు. కానీ ఈ విచారణలో ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పారని వార్తలు వస్తున్నాయి.

Also Read : జగన్‌ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదో తెలుసా..?

ఇక ఈ అంశానికి సంబంధించి అధికారులు టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి ఇప్పటికే విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం వై వి సుబ్బారెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే ధర్మారెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండొచ్చని సమాచారం. వీళ్ళ ఆదేశాలతోనే చిన్నప్పన్న బోలే బాబా డైయిరీ తో రాయబారాలు నడిపినట్లు గుర్తించారు. వైసీపీ కీలక నేతలను అరెస్టు చేసే విషయంలో పోలీసు అధికారులు ఈ మధ్యకాలంలో వెనకడుగు వేయడం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిధున్ రెడ్డి వంటి వాళ్లను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కేసులో వైవి సుబ్బారెడ్డిని కూడా దాదాపుగా అరెస్టు చేయవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్