Wednesday, May 6, 2026 09:02 PM
Wednesday, May 6, 2026 09:02 PM

తిరుమల లడ్డూ ప్రసాదం.. పవన్ ఘాటు వ్యాఖ్యలు..!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే.. తిరుమల వెళ్లి వచ్చామంటే.. ముందుగా లడ్డూ ఏది.. అనే ప్రశ్న అడుగుతారు. ఆ లడ్డూ ప్రసాదం రుచి మరెక్కడా దొరకదు కూడా. ప్రతి ఒక్కరు కూడా దేవస్థానం ఇచ్చే లడ్డూ ప్రసాదంతో పాటు అదనంగా లడ్డూలు కొనుగోలు చేస్తారు. వాటిని బంధువులు, స్నేహితులకు పంపిణీ చేస్తారు కూడా. అయితే ఇప్పుడు లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని వైసీపీ ప్రభుత్వంలో కల్తీ చేశారనేది కూటమి సర్కార్‌లో వెలుగు చూసిన అంశం. దీనిపై ఇప్పటికే సిట్ విచారణ జరుపుతోంది. సిట్ అధికారులు పలువురిని అరెస్టు కూడా చేశారు.

Also Read : బీహార్ లో ఎన్‌డీఏ జయకేతనం – పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ సర్వే

తిరుమల పవిత్రతపై వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చివరికి స్వామి వారి ప్రసాద తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అని అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లడ్డూ ప్రసాద నాణ్యత దారుణంగా ఉందని భక్తులు సైతం అప్పట్లో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి బాగోతంపై ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ధర్మారెడ్డి సెట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఆలోచనతో రండి.. అవకాశాలు అందుకోండి

తిరుమల ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నివాసం. తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదు. ఇది ఉమ్మడి భావోద్వేగం. తిరుమల లడ్డూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు అపరిచితుల మధ్య కూడా సమానంగా పంపిణీ చేస్తామన్నారు పవన్. ఎందుకంటే.. ఇది మా అందరి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తారు. సనాతనలు భావాలు, ఆచారాలు ఎగతాళి చేయబడినప్పుడు లేదా అణగదొక్కబడినప్పుడు.. ఇది కేవలం బాధ కలిగించేది కాదు.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది విశ్వాసం, భక్తిని కూడా విచ్ఛిన్నం చేస్తుందని పవన్ తెలిపారు. లౌకికత్వం రెండు వైపులా ఉండాలి. మన విశ్వాసం పట్ల రక్షణ, గౌరవం చర్చించలేనిదన్నారు పవన్.

Also Read : విజయనగరానికి దూరంగా బొత్సా కుటుంబం..? విశాఖపై ఫోకస్..?

మన సనాతన ధర్మం అత్యంత పురాతనమైనదని.. నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతలలో ఒకటన్నారు. మేము సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందంటూ సోషల్ మీడియాలో పవన్ పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చకు తెర లేపింది. నిజానికి గతంలో కూడా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పవన్ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ కూడా చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా సెట్ అరెస్టులు చేస్తున్న సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్