కూటమి ప్రభుత్వంపైన.. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీపైన బురద జల్లడానికి వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ అగ్రనేతలు చేస్తున్న కుట్రలు.. దానికి సాక్షి మీడియా చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. నిజానికి తెలుగుదేశం పార్టీ అంటే.. కమ్మ సామజిక వర్గానికి చెందిన పార్టీ అని గతంలో వైసీపీ నేతలు తెగ ప్రచారం చేశారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు అన్నీ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించారు వైఎస్ జగన్. టీటీడీ చైర్మన్ పదవుల నుంచి డీజీపీ, సీఎస్, సీఎంఓ అధికారులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో వైసీపీ చేసిన ఆరోపణలను అప్పట్లో టీడీపీ నేతలు సమగ్రంగా తిప్పి కొట్టారు.
Also Read : జోగి దందాలు.. సంచలనం దిశగా పోలీసులు..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న చంద్రబాబు.. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా సాధిస్తూ.. అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన అరాచకాలు, అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఇక పెన్షన్ పంపిణీ సహా సంక్షేమ పథకాల అమలు సమయంలో చంద్రబాబు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్తున్నారు. వారితో చర్చిస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో కూటమి పాలనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇలా చేయడంతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఎన్నికల్లో గెలుపు కష్టమని భయపడుతున్నారు.
దీంతో వైసీపీ నేతలు కుట్రలకు తెర లేపారు. ప్రధానంగా ఒక వర్గాన్ని దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. కూటమి గెలుపులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యులయ్యారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇది వైసీపీ నేతలకు మింగుడు పడన విషయం. అందుకే ఇప్పుడు అదే రిజర్వుడు నియోజకవర్గాల్లో కుట్రలకు తెర లేపారు. ప్రధానంగా నోటుకు సీటు అంటూ కూటమి సర్కార్‌పై తప్పుడు ఆరోపణలకు తెర లేపారు. ముందు తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఈ తరహా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కోడూరు నియోజకవర్గం టీడీపీ టికెట్ ఇప్పిస్తా అంటూ ఎన్ఆర్ఐ సతీష్ వేమన 7 కోట్లు తీసుకున్నారని సుధా మాధవి ఆరోపించారు.
Also Read : మంచి చెడు తెలియట్లేదు.. ఎమ్మెల్యేలపై లోకేష్ ఫైర్
ఎస్సీ నేతలను కమ్మ సామాజిక వర్గం నేతలు మోసం చేశారనే కోణంలో సాక్షి మీడియా పదే పదే వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే రెండు ఆరోపణల్లో వాస్తవం లేదని రుజువు కావడంతో.. వైసీపీ శ్రేణుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గెలుపు కోసం ఏ స్థాయికైనా దిగజారేందుకు వైసీపీ సిద్ధమంటూ విమర్శలు చేస్తున్నారు.

