Wednesday, February 4, 2026 03:31 PM
Wednesday, February 4, 2026 03:31 PM

జూబ్లీహిల్స్‌లో టీడీపీ ఓట్లు ఎవరికి..?

మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలో గెలుపు.. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని అంతా భావిస్తున్నారు. దీంతో ఉప ఎన్నికల ప్రకటనకు ముందు నుంచే అన్ని పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులు నియోజకవర్గంలో ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృత ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఎటు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : వారిపై చంద్రబాబు, లోకేష్ ఫోకస్..!

జూబ్లీహిల్స్ నియోజకవర్గం.. 2009లో తొలిసారి ఏర్పాటైంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. తొలి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్థన్ రెడ్డి 19 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సలీం 33 వేల ఓట్లు సాధించి రెండోస్థానంలో ఉన్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు 2014. ఆ ఎన్నికల్లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్.. 9 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత అనూహ్యంగా కేసీఆర్ సారధ్యంలోని కారు పార్టీలో చేరిన మాగంటి గోపీనాథ్… 2018, 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున పోటీ చేసి.. 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే మాగంటి గెలుపు వెనుక అసలు కారణం ఒకటే.. మాగంటికి తెలుగుదేశం పార్టీ ఓటర్లు మద్దతు తెలిపారు. మాగంటి ఎన్టీఆర్ అభిమాని అనే కారణంతోనే వరుసగా గెలిపించారు.

Also Read : శ్రీ చరణీ విషయంలో ఇలా.. అరుంధతీ రెడ్డి విషయంలో అలా..?

ఇక మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదీ అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తొలి నుంచి దూరంగా ఉంది. అయితే జనసేన పార్టీ మాత్రం బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతు తెలిపింది. కానీ టీడీపీ మాత్రం సైలెంట్‌గా ఉంది. దీంతో టీడీపీ ఓటు బ్యాంకు ఎటు వైపు పడుతుందనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయంపై పలు సర్వే సంస్థలు తమ నివేదికను బహిర్గతం చేశాయి కూడా. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీతకు సానుభూతి వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే కుటుంబ తగాదాలతో పాటు బీఆర్ఎస్ నేతల నోటి దూల కారణంగా సునీత ఓటు బ్యాంక్ పూర్తిగా పడిపోయింది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్ర ప్రాంత ప్రజలపైన బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బూతు పురాణం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సెటిలర్స్‌ పైన బాగా ప్రభావం చూపించనుంది.

Also Read : లోకేష్ దెబ్బకు అలెర్ట్ అయిన టీడీపీ నేతలు.. నియోజకవర్గాల్లో పరుగులు

మరోవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఇప్పటి వరకు సెటిలర్స్ ఎలాంటి ఇబ్బందులు పడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తేనే.. నాటి మంత్రి కేటీఆర్.. తీవ్ర విమర్శలు చేశారు. మీ రాష్ట్రంలో చేసుకోండి.. అవసరం అయితే రాజమండ్రి జైలు వద్ద చేసుకోవాలని హేళన చేసిన సంగతి టిడిపి అభిమానులు గుర్తు చేస్తున్నారు. కానీ నాడు చంద్రబాబు అరెస్టును కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైఎస్ జగన్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు కూడా. కెసిఆర్ సిఎం అయ్యాక టిడిపి ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. టిడిపి నాయకులు అందరినీ తన పార్టీలోకి తీసుకుని తెలంగాణాలో పార్టీ లేకుండా చేయాలనే ప్రయత్నాన్ని టిడిపి అభిమానులు మార్చిపోలేకపోతున్నారు.

Also Read : లోకేష్ దెబ్బకు అలెర్ట్ అయిన టీడీపీ నేతలు.. నియోజకవర్గాల్లో పరుగులు

ఇక బిఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు ఇప్పటికీ టిడిపి నాయకులు మర్చిపోలేకపోతున్నారు. అధికారంలో ఉండగా అహంభావంతో వ్యవహరించిన కెసిఆర్, కేటిఆర్ కి ఇప్పుడు టిడిపి అభిమానులు గుర్తొచ్చారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ అభిమానులు.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసే అవకాశం ఉందనే మాట బాగా వినిపిస్తోంది. మాగంటి సునీతకు ఓటు వేసినా.. ఆమె అందుబాటులో ఉండే అవకాశం లేదని.. మళ్లీ కేటీఆర్, హరీష్ రావు పెత్తనం చేస్తారనే భయం కూడా జూబ్లీహిల్స్ ఓటర్లలో ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులిద్దరూ గురు శిష్యులే కావడం.. సమస్యల పరిష్కారానికి ఇద్దరు నేతలు కలిసి కృషి చేస్తుండటాన్ని కూడా టీడీపీ అభిమానులు స్వాగతిస్తున్నారు. చంద్రబాబు కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని.. అందుకే ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదనేది తెలుగు తమ్ముళ్ల మాట. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ వైపు ఉందనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్