Wednesday, February 4, 2026 03:32 PM
Wednesday, February 4, 2026 03:32 PM

పోతే పొండి.. 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సంచలన కామెంట్స్

గత కొన్నాళ్లుగా పార్టీ ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తాజాగా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి వెళ్లకపోవడం, మంత్రులు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, ప్రజల నుంచి అర్జీలు తీసుకోకపోవడం, ఇన్చార్జి మంత్రులు కేటాయించిన జిల్లాలో పర్యటించకపోవడాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల పార్టీ కార్యాలయానికి వెళ్ళిన మంత్రి నారా లోకేష్.. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Also Read : ఎక్కడున్నా వేటాడతాం.. వైసీపీ సోషల్ మీడియాకు స్ట్రాంగ్ సిగ్నల్

ఇక తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేడు పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళిన చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పెన్షన్ల పంపిణీ, సిఎంఆర్ఎఫ్ లెటర్ లపై సంతకాలు, తదితర అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును అడిగే వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని పల్ల ముఖ్యమంత్రి వద్ద ఉంచారు. చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించడం లేదని, తాను చెప్పినా సరే ఎమ్మెల్యేలు వినడం లేదని పల్లా శ్రీనివాసరావు చంద్రబాబు దృష్టిలో పెట్టారు.

Also Read : లోకేష్ దెబ్బకు అలెర్ట్ అయిన టీడీపీ నేతలు.. నియోజకవర్గాల్లో పరుగులు

దీనికి సంబంధించి తన వద్ద ఉన్న పేర్లను కూడా సీఎం చంద్రబాబుకు ఇచ్చారు పల్లా శ్రీనివాసరావు. ఆ లిస్టు చూసిన చంద్రబాబు ఎమ్మెల్యేలు అందరికీ నోటీసులు ఇవ్వాలని.. 48 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారని, 4 వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందిస్తుంటే, ప్రతి నెల ఒకటో తేదీన ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని నిలదీసినట్లు సమాచారం. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, అవసరమైతే చర్యలు కూడా తీసుకునేందుకు తాను వెనకాడనని హెచ్చరించినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. మాట లెక్క చేయని ఎమ్మెల్యేలు రాజీనామా చేసేసిన పర్వాలేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్