Wednesday, February 4, 2026 03:31 PM
Wednesday, February 4, 2026 03:31 PM

వారి సంగతి ఎందుకు మర్చిపోయారు..?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. కూటమి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేశారు. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే.. వెంటనే కేసులు పెట్టారు. దాడులు చేశారు. వ్యక్తిత్వ హననానికి తెగ బడ్డారు. అరెస్టు చేసి నెలల తరబడి జైళ్లల్లో ఉంచారు. కోర్టుల చుట్టూ తిప్పారు. నానా ఇబ్బందులకు గురి చేశారు. అయినా సరే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. నాటి వైసీపీ నేతలను ఎదిరించారు. పోరాడి గెలిచారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు వస్తాయని ఆశించారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

Also Read  : కొలికపూడిని అందుకే సస్పెండ్ చేయడం లేదా..? చంద్రబాబు నిర్ణయం ఏంటీ..?

తెలుగుదేశం పార్టీ గెలుపులో కొందరు నేతలు కీలక పాత్ర పోషించారు. అటు మీడియాతో పాటు నిత్యం ప్రజల్లో ఉంటూ వైసీపీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇక కొంతమంది నేతలు ఆర్థికంగా పార్టీకి అండగా నిలిచారు. వీరితో పాటు ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేస్తున్న కొందరు నేతలు కూడా అధికారంలోకి వస్తే.. పదవి వస్తుందని.. సరైన గుర్తింపు వస్తుందని భావించారు. కానీ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరి విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారనే మాట కూడా వినిపిస్తోంది. కొందరి విషయంలో అయితే పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనే మాట ప్రస్తుతం పార్టీలోనే వినిపిస్తోంది. కొంతమందికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన వారిని మాత్రం పక్కన పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిన వారిలో శిష్ఠ్ల లోహిత్ ఒకరు. రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదిక పైనే ఏకంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇవి కాకుండా కొంతమంది నేతలకు ఆర్థిక సాయం చేశారు. ఇక రాజమండ్రి ఎంపీ టికెట్ మీకే అని నమ్మించి కొంతమంది సీనియర్ నేతలు సైతం లోహిత్ దగ్గర డబ్బులు తీసుకున్నారనే మాట కూడా బాగానే వినిపించింది. మహానాడు సమయంలో రాజమండ్రిలో ఓ నేత సుమారు 50 లక్షలు లోహిత్ దగ్గర తీసుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయంపై లోహిత్ ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. పైగా పార్టీ లైన్ దాటలేదు కూడా. అయినా సరే.. లోహిత్‌కు ఓ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు చంద్రబాబు. ఇది తనకు తీవ్ర అవమానంగా భావించిన లోహిత్ వద్దని మర్యాద పూర్వకంగా చెప్పేశారు.

Also Read  : లోకేష్ దెబ్బకు అలెర్ట్ అయిన టీడీపీ నేతలు.. నియోజకవర్గాల్లో పరుగులు

ఇక మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగు మహిళ కార్యదర్శి మజ్జి పద్మావతి కూడా తమకు వచ్చిన డైరెక్టర్ పోస్టులు వద్దని చెప్పేశారు. పదవి ఇవ్వకపోయినా పర్లేదు.. కానీ స్థాయి తక్కువ చేసే పదవి ఇచ్చి అవమానపరచవద్దని సున్నితంగా తిరస్కరించారు. ఇక పార్టీ తరఫున గట్టిగా మాట్లాడిన గొట్టిపాటి రామకృష్ణ సంగతి అయితే ఇప్పటి వరకు కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆయన తన న్యాయవాద వృత్తినే కొనసాగిస్తున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం లేదు. మరో నేత తిరునగరి జోత్స్న సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ తరఫున జాతీయ స్థాయిలో గళం విప్పిన జోత్స్న గురించి ఎలాంటి ప్రస్తావన రావటం లేదు. ఇక అధికారులు చేసిన తప్పునకు బలైన మరో నేత జీవీ రెడ్డి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ అవినీతిని బయటపెట్టినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. అసహనంతో పదవికి, పార్టీకి రాజీనామా చేసిన జీవీ రెడ్డి.. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఇలాంటి వారిని చంద్రబాబు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. వీరిలో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు పిలిచి మాట్లాడలేదు కూడా. పదవి ఎందుకు వద్దన్నారనే విషయం అటు అధినేత చంద్రబాబు, ఇటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పట్టించుకోలేదు. ఆ నేతల గురించి ఎందుకు పట్టించుకోవటం లేదనే ప్రశ్న ఇప్పుడు పార్టీలోనే వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్