Wednesday, August 5, 2026 11:33 AM
Wednesday, August 5, 2026 11:33 AM

తెలంగాణాలో భారీ పెట్టుబడి ప్లాన్.. చివరకు ఏపీకి.. అసలేం జరిగింది..?

2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఓ భిన్న వాతావరణం ఉండేది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను బలవంతంగా ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే పంపిస్తున్నారనే ఆరోపణ ఉండేది. అమర్ రాజా బ్యాటరీస్ మొదలు.. లూలు మాల్ వంటి సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయి. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారిని బెదిరించే ధోరణితో వ్యవహరిస్తూ అప్పటి ప్రజా ప్రతినిధులు చెలరేగిపోయిన పరిస్థితి ఉండేది. ఒకానొక సమయంలో కియా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

Also Read : రోజా.. ఏంటి ఇలా మారిపోయారు..!

అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే అగ్రశ్రేణి సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. పారిశ్రామికంగా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించడంతో భారీగా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల గూగుల్ పరిశ్రమ రాష్ట్రానికి రావడంతో, ఇప్పటి వరకు వెనకడుగు వేసిన వారు కూడా ముందుకు వచ్చారు. తాజాగా తెలంగాణాలో పెట్టుబడి కోసం ప్రయత్నం చేసిన ఓ కీలక సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి కోసం ముందుకు వచ్చింది.

Also Read : మోడీ నాకు మంచి ఫ్రెండ్.. భారత్ వెళ్తాను: ట్రంప్

ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ.. తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న తమ భారీ సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ కు తరలిస్తోంది. రూ.1,700 కోట్ల భారీ పెట్టుబడికి రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్‌ కు 1,700 కోట్ల రూపాయల సోలార్ ప్రాజెక్టు రావడం వెనుక కారణాలు ఒకసారి చూస్తే.. కంపెనీకి 269 ఎకరాల భూమిని ఏపీఐఐసి ద్వారా అతి తక్కువ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అక్టోబర్ 2024లో చర్చలు మొదలుపెట్టి.. ఫిబ్రవరి 2025 నాటికి భూమిని కేటాయించారు. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ పీవీ టాప్ కాన్ సెల్ తయారీ యూనిట్‌ ను ప్రారంభించనుంది. దానికి అనుబంధంగా 5 జీడబ్ల్యూ సిలికాన్ ఇంగట్, వేఫర్ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా సుమారు 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

పోల్స్